(1 / 5)
ఇతర గ్రహాలతో పోలిస్తే చంద్రుడు వేగంగా రాశులను మార్చేస్తుంటాడు. ఈ సంచార క్రమంలో వేరే గ్రహాలతో కలయిక జరుగుతుంటుంది. దీనివల్ల కొన్నిసార్లు రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అదేవిధంగా మే తొలి వారంలో మహాలక్ష్మి రాజయోగం సంభవించనుంది.
(2 / 5)
ప్రస్తుతం కర్కాటక రాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. దృక్ పంచాగం ప్రకారం, అదే రాశిలోకి మే 3వ తేదీ ఉదయం 6.36 గంటలకు చంద్రుడు ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో కుజుడు, సూర్యుడి కలయికతో మహాలక్ష్మి రాజయోగం సంభవించనుంది. మే 5వ తేదీ మధ్యాహ్నం 2.01 గంటల వరకు చంద్రుడు కర్కాటకంలో ఉంటాడు. అప్పటి వరకు ఈ యోగం ప్రభావం ఉంటుంది. మహాలక్ష్మి రాజయోగం ఉండే కాలంలో మూడు రాశుల వారికి ఎక్కువ శుభాలు కలుగుతాయి.
(3 / 5)
వృశ్చికం: మహాలక్ష్మి రాజయోగం వల్ల వృశ్చిక రాశి వారికి ప్రయోజనాలు దక్కుతాయి. వీరికి అదృష్టకాలం నడుస్తుంది. ఈ కాలంలో వీరు చేసే పనులు చాలా వరకు విజయవంతం అవుతాయి. డబ్బు విషయాల్లో లాభాలను చూస్తారు. ఇతర నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు లభించొచ్చు. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు.
(4 / 5)
కన్య: కర్కాటకంలో మహాలక్ష్మి రాజయోగం ఉండే కాలంలో కన్యా రాశి వారికి శుభాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారులకు ఆదాయం అధికం అవుతుంది. తోబుట్టువులతో సఖ్యత మెరుగవుతుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. దీంతో చేసే పనుల్లో సక్సెస్ అవుతారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది.
(Pixabay)(5 / 5)
తుల: కర్కాటక రాశిలో ఏర్పడే మహాలక్ష్మి రాజయోగం వల్ల తులారాశి వారికి కూడా మేలు జరుగుతుంది. ఈ కాలంలో వీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పనులు మొదలుపెట్టేందుకు ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు ధనపరమైన విషయాల్లో కలిసి వస్తుంది. మనశ్శాంతి కలుగుతుంది. (గమనిక: విశ్వాసాలు, శాస్త్రాలను అనుసరించి ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు