ఈ మూడు రాశుల వారికి అనుకూల సమయం వచ్చేస్తోంది.. సక్సెస్, ఆనందం పొందుతారు!-these three lucky zodiac signs to get lof of benefits and good time due to budhaditya rajyoga sun mercury conjunction ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ మూడు రాశుల వారికి అనుకూల సమయం వచ్చేస్తోంది.. సక్సెస్, ఆనందం పొందుతారు!

ఈ మూడు రాశుల వారికి అనుకూల సమయం వచ్చేస్తోంది.. సక్సెస్, ఆనందం పొందుతారు!

Published Apr 16, 2025 09:53 PM IST Chatakonda Krishna Prakash
Published Apr 16, 2025 09:53 PM IST

  • త్వరలో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. మేషరాశిలో ఇది సంభవించనుంది. దీనివల్ల మూడు రాశుల వారికి కాలం బాగా కలిసి వస్తుంది. ప్రయోజనాలు దక్కుతాయి.

గ్రహాల సంచారాల క్రమంలో యోగాలు ఏర్పడుతుంటాయి. ఇందులో కొన్నింటి ప్రభావం రాశులపై ఎక్కువగా ఉంటుంది. వాటిలో బుధాదిత్య రాజయోగం కూడా ఒకటి. త్వరలో ఈ యోగం ఏర్పడనుంది. ఆ వివరాలు ఇవే.

(1 / 5)

ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలోకి అడుగుపెట్టాడు. మే 7వ తేదీన అదే మేషరాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. మేషరాశిలో సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం మే 7న ఏర్పడనుంది. మేషంలో సూర్యుడు ఉండే మే 15 వరకు ఈ యోగం ప్రభావం ఉండనుంది. ఈ కాలంలో మూడు రాశులకు మెండుగా అదృష్టం ఉంటుంది.

(2 / 5)

(freepik)

కుంభం: మేషరాశిలో ఏర్పడే బుధాదిత్య రాజయోగం కుంభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో వీరు శుభవార్తలను వింటారు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. చేసే చాలా పనుల్లో సక్సెస్ ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులు వారి రంగాల్లో రాణిస్తారు. కుటుంబంతో సమయం సంతోషంగా గడుపుతారు. కొత్త పనులను మొదలుపెట్టొచ్చు.

(3 / 5)

మిథునం: బుధాదిత్య రాజయోగం ఉండే కాలంలో మిథున రాశి వారికి లక్ మెరుగ్గా ఉంటుంది. దీంతో అనుకున్న పనులు పూర్తవుతాయి. చాలా కాలంగా పెండింగ్‍లో ఉన్న కొన్ని విషయాలపై దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. ఏవైనా నూతన కార్యాలు చేసేందుకు పరిస్థితులు అనూకూలిస్తాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.

(4 / 5)

తుల: మేషరాశిలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల తులారాశి వారికి శుభప్రదం. ఈకాలంలో వీరికి ఆత్మవిశ్వాసం, ఆనందంగా ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సమాజంలో గౌరవం అధికమవుతుంది. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు పురోగతి ఉంటుంది. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు