చాతుర్‌గ్రాహి యోగం.. ఈ మూడు రాశుల వారికి ప్రయోజనం.. లక్ కలిసొస్తుంది!
- ఈనెలలో చాతుర్‌గ్రాహి యోగం ఏర్పడనుంది. నాలుగు గ్రహాల కలయికతో ఈ అరుదైన యోగం సంభవిస్తుంది. దీనివల్ల మూడు రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు ఉండనున్నాయి.
- ఈనెలలో చాతుర్‌గ్రాహి యోగం ఏర్పడనుంది. నాలుగు గ్రహాల కలయికతో ఈ అరుదైన యోగం సంభవిస్తుంది. దీనివల్ల మూడు రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు ఉండనున్నాయి.
(1 / 5)
గ్రహాలు సంచరిస్తున్న క్రమంలో వాటి కలయికల వల్ల కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. ఇవి రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈనెలలో చాతుర్‌గ్రాహి రాజయోగం ఉండనుంది. ఆ వివరాలివే..
(2 / 5)
కుంభరాశిలో బుధుడు, శని, శుక్రుడు, చంద్రుడి కలయిక వల్ల ఫిబ్రవరి 27వ తేదీన అరుదైన చాతుర్‌గ్రాహి యోగం ఏర్పడనుంది. సుమారు రెండు రోజుల పాటు ఈ యోగం ఉండనుంది. కుంభంలో చాతుర్‌గ్రాహి యోగం వల్ల మూడు రాశుల వారికి ఎక్కువగా కలిసి రానుంది.
(3 / 5)
మేషం: చాతుర్‌గ్రాహి యోగం వల్ల మేషరాశి వారికి మేలు జరుగుతుంది. ఈ కాలంలో వీరు చేసే పనులు సఫలం అవుతాయి. ధనపరమైన విషయాల్లో సానుకూలంగా పరిస్థితులు ఉంటాయి. అన్ని విషయాల్లో అదృష్టం మద్దతుగా ఉంటుంది. పెండింగ్ పనులు కొన్ని పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
(4 / 5)
ధనస్సు: ధనూ రాశి వారికి చాతుర్‌గ్రాహి యోగం ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి ఈ కాలంలో ఆత్మవిశ్వాసం బాగుంటుంది. చేసే పనుల్లో ఎక్కువ శాతం విజయవంతం అవుతాయి. ఆర్థికంగా లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. కొందరికి ఆకస్మికంగా డబ్బు దక్కే ఛాన్స్ ఉంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.
(5 / 5)
కుంభం: ఈ రాశిలోనే చాతుర్‌గ్రాహి యోగం ఏర్పడనుంది. అందుకే కుంభ రాశి వారికి ఇది కలిసి వస్తుంది. వీరికి ఈ కాలంలో ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో గౌరవం అధికం అవుతుంది. ధనపరమైన అంశాల్లో పరిస్థితులు కలిసివస్తాయి. లక్ సపోర్ట్ చేస్తుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు