(1 / 5)
జ్యోతిష శాస్త్రం ప్రకారం.. శని తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహం గురుడు. ప్రస్తుతం గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. చంద్రుడితో గురుడు కలిసినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. జూన్ 14వ తేదీన గజకేసరి రాజయోగం ఏర్పడనుంది.
(2 / 5)
చంద్రుడు ఒకరాశిలో ప్రవేశించి, దానిపై గురుడి మంచి దృష్టి పెరిగితే గజకేసరి రాజయోగం ఉంటుంది. జూన్ 14వ తేదీన తెల్లవారుజామున 1 గంట 54 నిమిషాలకు ఈ రాజయోగం ఏర్పడనుంది. జూన్ 16వ తేదీ వరకు ఉండనుంది. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు దక్కుతాయి.
(3 / 5)
కర్కాటకం: ఈ కాలంలో కర్కాటక రాశి వారు ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. పనిపై మనసు పెడితే కచ్చితంగా విజయం సిద్ధిస్తుంది. కెరీర్ విషయంలో గందరగోళం ఉంటే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆన్‍లైన్ వ్యాపారం చేసే వారికి లాభాలు కలుగుతాయి. విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.
(4 / 5)
మిథునం: ఈ కాలంలో మిథున రాశి వారికి మానసిక సమస్యలు దూరమవుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. వివాదాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇళ్లు, కారు లాంటి ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. వృత్తిలో పురోగతి, లాభం ఉంటాయి.
(5 / 5)
ధనస్సు: ఈ రాశిలో పదో స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఉద్యోగం చేసే ధనస్సు రాశి వారికి ఈ కాలంలో మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి ఆనందం లభిస్తుదంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్త పనులను ప్రారంభించవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాలు ఆధారంగా రూపొందించిన కథనం ఇది. దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు.)
ఇతర గ్యాలరీలు