మహాలక్ష్మి రాజయోగం: ఈరాశుల వారికి మెండుగా అదృష్టం.. ఆర్థిక లాభాలు, సంతోషం!-these three lucky zodiac signs may get happiness and more benefits due to mahalakshmi raj yoga ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మహాలక్ష్మి రాజయోగం: ఈరాశుల వారికి మెండుగా అదృష్టం.. ఆర్థిక లాభాలు, సంతోషం!

మహాలక్ష్మి రాజయోగం: ఈరాశుల వారికి మెండుగా అదృష్టం.. ఆర్థిక లాభాలు, సంతోషం!

Published Mar 05, 2025 04:52 PM IST Chatakonda Krishna Prakash
Published Mar 05, 2025 04:52 PM IST

  • ఈ వారంలోనే మహాలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది. దీనివల్ల మూడు రాశులకు ఎక్కువ ప్రయోజనాలు దక్కనున్నాయి. లక్ బాగా ఉంటుంది.

జ్యోతిషం ప్రకారం, నిర్దిష్ట కాలంలో గ్రహాలు.. రాశులు, నక్షత్రాలను మారుతుంటాయి. ఈ సంచార క్రమంలో గ్రహాల కలయికలతో రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అలా ఈవారంలో మహాలక్ష్మి యోగం సంభవించనుంది. 

(1 / 5)

(Freepik)

ప్రస్తుతం కుజుడు.. మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మరో రెండు రోజుల్లో అంటే మార్చి 7వ తేదీన మిథునంలో చంద్రుడు అడుగుపెట్టనున్నాడు. దీంతో మిథునంలో కుజుడు, చంద్రుడి కలయిక వల్ల మహాలక్ష్మి యోగం ఏర్పడనుంది. సుమారు రెండు రోజులు దీని ప్రభావం ఉంటుంది. ఈ కాలంలో మూడు రాశుల వారికి ఎక్కువ లాభాలు ఉంటాయి. 

(2 / 5)

(Pixabay)

కన్య: మహాలక్ష్మి రాజయోగం కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో వీరికి ఆర్థిక విషయాల్లో కలిసి వస్తుంది. వ్యాపారులు, ఉద్యోగులకు ధనపరమైన అంశాల్లో అదృష్టం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం ఆనందంగా గడుపుతారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కొందరు ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. 

(3 / 5)

వృషభం: ఈ యోగం వృషభ రాశి వారికి ప్రయోజనకరం. ఈ కాలంలో వీరికి అదృష్టం చాలా విషయాల్లో సపోర్ట్ చేస్తుంది. ఎక్కువ పనులు విజయవంతం అవుతాయి. కుటుంబం నుంచి మద్దతు ఎక్కువగా లభిస్తుంది. వ్యాపారులకు లాభాలు అధికమయ్యే అవకాశం ఉంది. మీ రంగాల్లోని కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 

(4 / 5)

సింహం: మహాలక్ష్మి రాజయోగం.. సింహ రాశి వారికి మేలు చేస్తుంది. ఈ కాలంలో వీరికి ఆత్మ విశ్వాసం మెండుగా ఉంటుంది. ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. వేరే వ్యక్తుల నుంచి రావాల్సిన డబ్బు వసూలయ్యే అవకాశాలు ఉంటాయి. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. ఇవి అంచాలు మాత్రమే. కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

(Pexel)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు