ఈ రాశుల వారికి పెరగనున్న అదృష్టం.. ధన లాభం, ఇతరుల నుంచి మద్దతు!
- శుక్రుడు త్వరలో నక్షత్రం మారనున్నాడు. జ్యేష్ఠ నక్షత్రంలో అడుగుపెట్టనున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
- శుక్రుడు త్వరలో నక్షత్రం మారనున్నాడు. జ్యేష్ఠ నక్షత్రంలో అడుగుపెట్టనున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
(1 / 5)
జ్యోతిషం ప్రకారం.. సంపద, సుఖాలు, వినోదం, శ్రేయస్సుకు కారకుడైన శుక్రుడి సంచారం చాలా ముఖ్యమైనది. శుక్రుడి సంచారం రాశులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అలాంటి శుక్రుడు త్వరలో నక్షత్రం మారనున్నాడు.
(2 / 5)
ప్రస్తుతం అనూరాధ నక్షత్రంలో ఉన్న శుక్రుడు అక్టోబర్ 27వ తేదీన జ్యేష్ఠ నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 7 వరకు జ్యేష్ఠలో శుక్రుడు సంచరిస్తాడు. ఈ కాలంలో మూడు రాశుల వారికి అదృష్టం పెరిగి.. ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. అవేవంటే..
(3 / 5)
కన్య: జ్యేష్ఠ నక్షత్రంలో శుక్రుడు సంచరించే కాలం కన్య రాశి వారికి శుభాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పరిస్థితులు సహకరిస్తాయి. సహచరులు, ఉన్నతాధికారుల నుంచి మద్దతు దొరుకుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ధనాన్ని ఎక్కువగా పొదుపు చేస్తారు. చాలా కాలంగా పెండింగ్‍లో ఉన్న కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు లాభాలు పెరగొచ్చు.
(4 / 5)
మకరం: ఈ కాలం మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి ధన లాభం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వివిధ మార్గాల నుంచి డబ్బు లభించొచ్చు. భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. చేసే పనుల్లో అధిక శాతం సఫలీకృతమవుతాయి.
(5 / 5)
సింహం: జ్యేష్ఠ నక్షత్రంలో శుక్రుడి సంచారం సింహ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ కాలంలో వీరి ఆదాయం ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభం అధికమవుతుంది. కుటుంబంతో సమయం సంతోషంగా గడుపుతారు. పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. (గమనిక: విశ్వాసాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించాలి)
ఇతర గ్యాలరీలు