మరో రెండు రోజుల్లో ఈ మూడు రాశులకు మారనున్న అదృష్టం.. చాలా ప్రయోజనాలు!-these lucky zodiac signs to get lot of benefits due to gajakesari rajyog ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మరో రెండు రోజుల్లో ఈ మూడు రాశులకు మారనున్న అదృష్టం.. చాలా ప్రయోజనాలు!

మరో రెండు రోజుల్లో ఈ మూడు రాశులకు మారనున్న అదృష్టం.. చాలా ప్రయోజనాలు!

Jan 07, 2025, 12:44 PM IST Chatakonda Krishna Prakash
Jan 07, 2025, 12:44 PM , IST

  • మరో రెండు రోజుల్లో గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. గురు, చంద్రుల కలయికతో ఇది సంభవించనుంది. దీంతో మూడు రాశుల వారికి ఇది ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది.

జ్యోతిషం ప్రకారం, చంద్రుడు వేగంగా సంచరిస్తుంటాడు. ప్రతీ రెండున్నర రోజులకు రాశి మారుతుంటాడు. ఈ క్రమంలో జనవరి 9న వృషభంలోకి చంద్రుడు అడుగుపెడతాడు. దీంతో ఓ యోగం ఏర్పడనుంది. 

(1 / 5)

(Freepik)

మరో రెండు రోజుల్లో అంటే జనవరి 9వ తేదీ వృషభ రాశిలోకి చంద్రుడు అడుగుపెట్టనున్నాడు. ఇప్పటికే ఆ రాశిలో గురు సంచరిస్తున్నాడు. దీంతో గురు, చంద్రుల కలయికతో గజకేసరి యోగం జనవరి 9న ఏర్పడనుంది. దీంతో సుమారు రెండు రోజులు.. మూడు రాశుల వారికి ఎక్కవగా లాభించనుంది. శుభాలు కలుగుతాయి. 

(2 / 5)

కుంభం: గజకేసరి రాజయోగం కాలం కుంభరాశి వారి అదృష్టాన్ని మార్చేస్తుంది. ఈ కాలంలో వీరికి ధనంతో పాటు చాలా విషయాల్లో కలిసి వస్తుంది. వ్యాపారులకు ఆదాయం అధికమవుతుంది. ఉద్యోగులకు సహచరుల మద్దతు పెరుగుతుంది. ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు.

(3 / 5)

వృషభం: ఈ రాశిలోనే చంద్రుడు, గురు కలయిక ఉండనుంది. ఈ యోగ కాలంలో వృషభ రాశి వారికి శుభప్రదం. కార్యసిద్ధి మెండుగా ఉంటుంది. చేసే పనుల వల్ల ప్రయోజనాలు దక్కుతాయి. అదృష్టం బాగా మద్దతు ఇస్తుంది. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

(4 / 5)

ధనూరాశి: గజకేసరి రాజయోగ కాలంలో ధనూరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ధనపరంగా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశాలు అధికం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు