మాలవ్య రాజయోగం: ఈ ఐదు రాశుల వారికి కలిసి రానున్న అదృష్టం!
శుక్రుడు సెప్టెంబర్‌లో తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. దీనివల్ల ఐదు రాశుల వారికి కలిసి రానుంది. మాలవ్య రాజయోగం ఎప్పుడు ఉండనుంది.. ఏ రాశులకు మేలు జరిగే అవకాశం ఉందంటే..
(1 / 6)
ఏడాది తర్వాత శుక్రుడు తన సొంతరాశి తులారాశిలో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం కన్యా రాశిలో సంచరిస్తున్న శుక్రుడు.. సెప్టెంబర్ 18వ తేదీన తులా రాశిలో ప్రవేశించనున్నాడు. దీనివల్ల మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 13 వరకు తులారాశిలో శుక్రుడు సంచరిస్తాడు. ఈ కాలంలో ఐదు రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చి ప్రయోజాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి.
(2 / 6)
వృషభం: తులా రాశిలో శుక్రుడి సంచారం.. వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. ఈ కాలంలో వీరికి కొత్త ఆదాయ మార్గాలు దొరికే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగుల జీతం పెరగొచ్చు. డబ్బు ఆదాపై దృష్టి పెట్టాలి.
(3 / 6)
మేషం: మాలవ్య యోగ కాలంలో మేష రాశి వారికి కలిసి వస్తుంది. చేస్తున్న వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉంటాయి. పూర్వీకుల ఆస్తులు కలిసి రావొచ్చు. జీవిత భాగస్వామితో బంధం మెరుగవుతుంది.
(4 / 6)
కర్కాటకం: మాలవ్య రాజయోగం కర్కాటక రాశి వారి అదృష్టాన్ని పెంచుతుంది. ఈ కాలంలో వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి దక్కొచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ప్రేమలో ఉన్న వారికి పరిస్థితులు కలిసి వస్తాయి. ఆర్థికపరంగా పరిస్థితి బాగుంటుంది.
(5 / 6)
తులా: శుక్రుడి ప్రభావం తులా రాశికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో వీరికి అదనపు ఆదాయం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కంటే ఎక్కువగా డబ్బును ఆదా చేస్తారు. వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో మంచి మార్పులు చూస్తారు. పెట్టిన పెట్టుబడులకు రాబడి బాగా వచ్చే ఛాన్స్ ఉంది. పెళ్లి కోసం ప్రయత్నించే వారికి సత్ఫలితాలు కలుగుతాయి.
(6 / 6)
మకరం: తులా రాశిలో శుక్రుడి సంచారం మకర రాశి వారికి కలిసి రానుంది. ఈ కాలంలో సమాజంలో వీరి గౌరవం మరింత పెరుగుతుంది. ఉద్యోగం మారాలనుకుంటే సానుకూలంగా ఉంటుంది. ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఉండే పరిష్కారమయ్యేందుకు అవకాశం ఉంది. కోర్టు తీర్పులు అనుకూలంగా రావొచ్చు. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారాన్ని అందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, ఏవైనా సందేహాలు ఉండే సంబంధింత నిపుణులను సంప్రదించాలి.)
ఇతర గ్యాలరీలు