(1 / 5)
మే 16వ తేదీన శుక్రుడు.. రేవతి నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. ఇదే నెల మే 31వ తేదీన మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఒకే నెలలో శుక్రుడి సంచారంలో మార్పులు ఉండన్నాయి. జూన్ 29వ తేదీ వరకు మేషంలోనే శుక్రుడు సంచరిస్తాడు. మే నెలలో ఈ మార్పుల వల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం మారనుంది. పరిస్థితులు కలిసొస్తాయి.
(2 / 5)
కర్కాటకం: శుక్రుడి సంచారాల్లో మార్పుల వల్ల కర్కాటక రాశి వారికి మేలు జరుగుతుంది. వ్యాపారులకు ఆదాయం పెరగటంతో పాటు కొత్త ఒప్పందాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుంది. అదృష్టం మెండుగా ఉంటుంది. చాలా విషయాల్లో లాభాలు సిద్ధిస్తాయి. ఆనందంగా సమయం గడుపుతారు.
(3 / 5)
కుంభం: ఈ మార్పులతో కుంభ రాశి వారి పరిస్థితులు కూడా మారిపోతాయి. ముఖ్యంగా మేషంలో శుక్రుడి సంచారం వీరికి లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. లక్ సపోర్ట్ ఉండడం వల్ల చాలా పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొందరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
(4 / 5)
మేషం: ఈ రాశిలోకే మే చివర్లో శుక్రుడు అడుగుపెట్టనున్నాడు. దీంతో మేషరాశి వారికి ఇది ప్రయోజనకరం. ఈ కాలంలో వీరికి చాలా విషయాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొత్త పనులు మొదలు పెట్టేందుకు ఉత్సాహం చూపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. తోబుట్టువుల మద్దతు బాగా ఉంటుంది.
(5 / 5)
సింహం: శుక్రుడి మార్పుల వల్ల సింహ రాశి వారికి కాలం కలిసివస్తుంది. వీరి దశ మారుతుంది. అదృష్టం వెన్నంటే ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడుపుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు ధనపరమైన విషయాల్లో లాభాలు చేకూరే అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)
ఇతర గ్యాలరీలు