పరివర్తన యోగం: మూడు రాశుల వారికి లక్.. సంపద, సంతోషం పెరగనున్నాయి!-these lucky zodiac signs may get more revenue and happiness due to parivartan yoga venus and jupiter houses swap ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  పరివర్తన యోగం: మూడు రాశుల వారికి లక్.. సంపద, సంతోషం పెరగనున్నాయి!

పరివర్తన యోగం: మూడు రాశుల వారికి లక్.. సంపద, సంతోషం పెరగనున్నాయి!

Nov 05, 2024, 03:30 PM IST Chatakonda Krishna Prakash
Nov 05, 2024, 03:27 PM , IST

  • శుక్రుడు, బృహస్పతి సంచారం వల్ల అతిత్వరలో పరివర్తన యోగం ఏర్పడనుంది. ఈ యోగం మూడు రాశుల వారికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. వారికి కాలం కలిసి వస్తుంది.

జ్యోతిష శాస్త్రం ప్రకారం, గురువు (బృహస్పతి), శుక్ర గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. జ్ఞానం, సంతానం, సంపదకు బృహస్పతిని, ఆనందం, అందం, విలాసం, ధనానికి శుక్రుడిని కారకులుగా పరిగణిస్తారు. ఈ గ్రహాల సంచారం రాశులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. 

(1 / 6)

ప్రస్తుతం శుక్రుడికి చెందిన వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు. ఈ ఏడాది మే 1 నుంచి అదే రాశిలో ఉన్నాడు. శుక్రుడు నవంబర్ 7వ తేదీన ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ధనస్సు రాశి.. గురువుకు చెందినది.

(2 / 6)

శుక్రుడికి చెందిన వృషభ రాశిలో గురువు ఇప్పటికే సంచరిస్తుండగా.. మరో రెండు రోజుల్లో నవంబర్ 7న గురువుకు చెందిన ధనస్సు రాశిలో శుక్రుడు అడుగుపెట్టనున్నాడు. దీనివల్ల నవంబర్ 7న పరివర్తన రాజయోగం ఏర్పడనుంది. డిసెంబర్ 2 వరకు ఈ యోగం ఉంటుంది. ఈ కాలంలో మూడు రాశుల వారికి ఎక్కువగా అదృష్టం కలిసి రానుంది. 

(3 / 6)

సింహం: ఈ పరివర్తన యోగం వల్ల సింహ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. ఈ రాశిలో శుక్రుడు ఐదో స్థానంలో, గురువు పదో స్థానంలో ఉంటారు. ఈ కాలంలో సమాజంలో వీరి గౌరవం పెరుగుతుంది. వీరికి సంపద అధికంగా. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. పిల్లల వల్ల శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. 

(4 / 6)

కన్య: ఈ యోగం కాలంలో కన్యా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. చేసే ఎక్కువ పనుల్లో విజయం సిద్ధిస్తుంది. డబ్బు ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంటుంది. ఆకస్మిక లాభాలు రావొచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల నుంచి అన్ని విషయాల్లో మద్దతు పెరుగుతుంది.

(5 / 6)

వృశ్చికం: పరివర్తన యోగ కాలంలో వృశ్చిక రాశి వారికి శుభాలు కలుగుతాయి. ఈ కాలంలో గురువు ఏడో స్థానంలో, శుక్రుడు రెండో స్థానంలో ఉంటారు. దీంతో వీరికి ఆర్థికంగా బాగుంటుంది. ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులను సానుకూలంగా ఉంటుంది. జీతం పెరిగొచ్చు. వ్యాపారస్తులకు ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించాలి

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు