మిథునంలో యోగం: ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం.. ఆత్మవిశ్వాసం, గౌరవం, ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా కలుగుతాయి!-these lucky zodiac signs may get many benefits due to trigrahi yog in gemini ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మిథునంలో యోగం: ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం.. ఆత్మవిశ్వాసం, గౌరవం, ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా కలుగుతాయి!

మిథునంలో యోగం: ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం.. ఆత్మవిశ్వాసం, గౌరవం, ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా కలుగుతాయి!

Updated May 12, 2025 03:31 PM IST Chatakonda Krishna Prakash
Updated May 12, 2025 03:31 PM IST

మిథున రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఇది నాలుగు రాశుల వారికి చాలా కలిసి రానుంది. అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆ రాశులు ఏవంటే..

గ్రహాలు సంచరించే క్రమంలో కొన్నిసార్లు రాశుల్లో కలుస్తుంటాయి. గ్రహాల కలయికల వల్ల యోగాలు ఏర్పడుతుంటాయి. ఇవి రాశుల అదృష్టంపై ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తాయి.

(1 / 6)

మిథున రాశిలోకి గురువు.. మే 14న ప్రవేశిస్తాడు. అదే రాశిలోకి జూన్ 6న బుధుడు అడుగుపెడతాడు. మిథున రాశిలోకే జూన్ 15న సూర్యుడు అడుగుపెడతాడు. దీంతో జూన్ 15న మిథున రాశిలో గురువు, బుధుడు, సూర్యుడి కలయికతో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. జూన్ 22 వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ కాలంలో నాలుగు రాశుల వారికి అదృష్టం ఎక్కువగా కలిసి వస్తుంది.

(2 / 6)

సింహం: మిథున రాశిలో త్రిగ్రాహి యోగం సింహ రాశి వారికి ఎంతో కలిసి వస్తుంది. గురువు, సూర్యుడు, బధుడి కలయికతో వీరికి అదృష్టం పడుతుంది. అన్ని విషయాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు చేస్తారు. ఫలితాలు సానుకూలంగా ఉంటాయి.

(3 / 6)

వృశ్చికం: ఈ కాలంలో వృశ్చిక రాశి వారికి లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఇబ్బందులు ఏవైనా ఉంటే తొలగుతాయి. ఆనందంగా ఉంటారు. వ్యాపారులు, ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక కష్టాల నుంచి ఉపశమనం దక్కుతుంది. డబ్బు విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు. ఇది మేలు చేస్తుంది.

(4 / 6)

మిథునం: ఈ రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. దీంతో వీరికి ఈ కాలంలో శుభాలు కలుగుతాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరుగుతుంది. పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఆదాయం పెరగడంతో పాటు కొత్త డీల్స్ కుదరొచ్చు. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి.

(5 / 6)

తుల: మిథున రాశిలో త్రిగ్రాహి యోగం ఉన్న కాలం తులా రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది. దీంతో చాలా పనులు సక్సెస్ అవుతాయి. సమాజంలో వీరికి గౌరవం బాగా దక్కుతుంది. డబ్బు విషయాల్లో పరిస్థితులు కలిసి వస్తాయి. ఇల్లు కొనాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ కథనం రూపొందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించాలి.)

(6 / 6)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు