Sun Transit : నాలుగు రాశుల వారికి రానున్న అదృష్ట కాలం.. ధనంతో పాటు మరిన్ని లాభాలు!
- Sun Transit: సూర్యుడు త్వరలో రాశి మారనున్నాడు. ఇది నాలుగు రాశుల వారి అదృష్టాన్ని మార్చబోతోంది. వారికి చాలా ప్రయోజనాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇవే..
- Sun Transit: సూర్యుడు త్వరలో రాశి మారనున్నాడు. ఇది నాలుగు రాశుల వారి అదృష్టాన్ని మార్చబోతోంది. వారికి చాలా ప్రయోజనాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇవే..
(1 / 5)
ప్రస్తుతం మకరంలో సంచరిస్తున్న గ్రహాల రారాజు సూర్యుడు.. మరో 10 రోజుల్లో రాశి మారనున్నాడు. ఫిబ్రవరి 12వ తేదీన కుంభ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. మార్చి 14వ తేదీ వరకు అదే రాశిలో సంచరిస్తాడు. కుంభంలో సూర్యుడు సంచరించే కాలంలో నాలుగు రాశుల వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది.
(2 / 5)
మేషం: కుంభంలో సూర్యుడి సంచారం మేష రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ కాలంలో వీరికి ధనలాభం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరగొచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు దక్కుతాయి.
(3 / 5)
వృశ్చికం: ఈ కాలం వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరం. వీరి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ధనపరమైన విషయాల్లో కలిసి వస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఆనందం అధికం అవుతుంది. ప్రయాణాలు చేయాల్సి వచ్చినా అవి లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు చాలా విధాలుగా పరిస్థితులు కలిసి వస్తాయి.
(4 / 5)
వృషభం: సూర్యుడి ఈ మార్పు వల్ల వృషభ రాశి వారికి కాలం కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి మంచి రాబడి రావొచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా లాభాలు చేకూరే ఛాన్స్ ఉంటుంది. అదనపు ఆదాయం కలగొచ్చు. చేసే పనుల్లో చాలా శాతం విజయవంతం అవుతాయి.
(5 / 5)
సింహం: కుంభ రాశిలో సూర్యుడు సంచరించే కాలం సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఈ కాలంలో సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొందరికి ఆకస్మిక ధనలాభం కలగొచ్చు. జీవిత భాగస్వామితో బంధం మరింత మెరుగవుతుంది. తోబుట్టువుల నుంచి మద్దతు పెరుగుతుంది. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాలను బట్టి ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు