తెలుగు న్యూస్ / ఫోటో /
ఈరాశుల వారికి కలిసి రానున్న టైమ్.. కుటుంబంలో సంతోషం, మెండుగా ధనం!
- శుక్రుడు ఈనెలలోనే మరోసారి నక్షత్రం మారనున్నాడు. దీనివల్ల మూడు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. ఎప్పుడు, ఏ రాశులకంటే..
- శుక్రుడు ఈనెలలోనే మరోసారి నక్షత్రం మారనున్నాడు. దీనివల్ల మూడు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. ఎప్పుడు, ఏ రాశులకంటే..
(1 / 5)
జ్యోతిషం ప్రకారం.. ప్రేమ, సంపద, ఆకర్షణ, విలాసాలకు శుక్రుడు కారకుడు. శుక్రుడి సంచారం రాశులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈనెలలో శుక్రుడు మరోసారి నక్షత్రం మారనున్నాడు.
(2 / 5)
ప్రస్తుతం షతభిష నక్షత్రంలో ఉన్న శుక్రుడు.. జనవరి 17వ తేదీన పూర్వ భాద్రపదలోకి అడుగుపెట్టనున్నాడు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు పూర్వ భాద్రపద నక్షత్రంలో శుక్రుడు సంచరించనున్నాడు. దీంతో ఈ కాలంలో ఈ మూడు రాశులకు ఎక్కువ ప్రయోజనాలు ఉండనున్నాయి.
(3 / 5)
మకరం: పూర్వ భాద్రపదలో శుక్రుడి సంచారం మకర రాశి వారికి శుభప్రదం. ఈ కాలంలో కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆర్థికంగానూ లాభాలు ఉంటాయి. ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది.
(4 / 5)
కుంభం: ఈ కాలంలో కుంభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆస్తులు కొనాలనుకునే వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉంటే తొలగే అవకాశం ఉంది. వ్యాపారులకు ధనలాభం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఉద్యోగులకు కూడా కలిసి వస్తుంది.
(5 / 5)
వృశ్చికం: పూర్వ భాద్రపద నక్షత్రంలో శుక్రుడి సంచారం వృశ్చిక రాశి వారికి శుభాలను తెచ్చిపెడుతుంది. ఈ కాలంలో కుటుంబ సభ్యుల నుంచి వీరికి చాలా విషయాల్లో మద్దతు పెరుగుతుంది. చేేసే పనుల్లో విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపారులకు, ఉద్యోగులకు ధనపరంగా లాభాలు ఉంటాయి. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించాలి.)
ఇతర గ్యాలరీలు