వచ్చే నెల ఈ రాశుల వారి టైమ్ మారనుంది.. ఆనందం, ఆదాయం పెరుగుతాయి!-these lucky zodiac signs may get lot of benefits due to mercury transit in aries in may ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వచ్చే నెల ఈ రాశుల వారి టైమ్ మారనుంది.. ఆనందం, ఆదాయం పెరుగుతాయి!

వచ్చే నెల ఈ రాశుల వారి టైమ్ మారనుంది.. ఆనందం, ఆదాయం పెరుగుతాయి!

Published Apr 13, 2025 04:49 PM IST Chatakonda Krishna Prakash
Published Apr 13, 2025 04:49 PM IST

  • బుధుడు వచ్చే నెల మేలో రాశి మారనున్నాడు. ఈ మార్పుతో కొన్ని రాశుల వారికి సమయం మారనుంది. అదృష్టం, ప్రయోజనాలను పొందుతారు.

గ్రహాల రాకుమారుడిగా పరిగణించే బుధుడి కదలికలు రాశులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. వివేకం, వ్యాపారం, విద్యకు కారకుడిగా బుధుడిని భావిస్తారు. అలాంటి బుధుడు వచ్చే నెల (మే)లో రాశి మారనున్నాడు.

(1 / 5)

ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న బుధుడు మే నెలలో మేషరాశిలోకి అడుగుపెడతాడు. మే 7వ తేదీన మేషరాశిలో బుధుడు ప్రవేశిస్తాడు. మే 23వ తేదీ వరకు అదే రాశిలో సంచరిస్తాడు. మేషరాశిలో బుధుడు సంచరించే కాలం మూడు రాశుల వారికి ఎక్కువగా కలిసి వస్తుంది.

(2 / 5)

మిథునం: మేషరాశిలో బుధుడు సంచరించడం మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ మార్పుతో వీరికి సమయం మారుతుంది. అదృష్టం మెండుగా ఉంటుంది. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు కూడా డబ్బు విషయాల్లో పరిస్థితులు కలిసి వస్తాయి. ఉత్సాహంగా ఉంటారు. ధనం పొదుపు చేయడంపై దృష్టిసారిస్తారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది.

(3 / 5)

సింహం: మేషరాశిలో బుధుడు ప్రవేశించడంతో సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ కాలంలో వీరు చేసే పనుల్లో అధిక శాతం సఫలీకృతమవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలతో కొత్త విషయాలు తెలుసుకుంటారు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతుగా బాగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

(4 / 5)

మకరం: మేషరాశిలో బుధుడు సంచరించే కాలం మకర రాశి వారికి మేలు జరుగుతుంది. ఈ కాలంలో వీరికి సంతోషంగా బాగుంటుంది. కుటుంబంలో ఏవైనా గొడవలు ఉంటే తగ్గుతాయి. వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఉద్యోగులకు పరిస్థితులు కలిసి వస్తాయి. కొత్త పనులు మొదలుపెట్టేందుకు సమయం అనుకూలిస్తుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు