మరో రెండు రోజుల్లో ఈ మూడు రాశుల వారికి గుడ్‍టైమ్ మొదలు.. లక్ కలిసొస్తుంది!
- శుక్రుడు మరో రెండు రోజుల్లో నక్షత్రం మారనున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి మంచి టైమ్‍ను తెచ్చిపెట్టనుంది. వారికి అనేక విషయాల్లో లాభాలు దక్కొచ్చు.
- శుక్రుడు మరో రెండు రోజుల్లో నక్షత్రం మారనున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి మంచి టైమ్‍ను తెచ్చిపెట్టనుంది. వారికి అనేక విషయాల్లో లాభాలు దక్కొచ్చు.
(1 / 5)
శుక్రుడి సంచార ప్రభావం రాశులపై మెండుగా ఉంటుంది. ప్రస్తుతం ఉత్తరాషాఢలో ఉన్న శుక్రుడు ఈ వారంలోనే నక్షత్రం మారనున్నాడు. ఇది మూడు రాశుల వారికి బాగా కలిసి రానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(2 / 5)
మరో రెండు రోజుల్లో అంటే జనవరి 30వ తేదీన శ్రవణ నక్షత్రంలోకి శుక్రుడు అడుగుపెట్టనున్నాడు. ఫిబ్రవరి 7వ తేదీ వరకు అదే నక్షత్రంలో ఉంటాడు. శ్రవణలో శుక్రుడు సంచరించే సుమారు తొమ్మిది రోజులు మూడు రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వనుంది.
(3 / 5)
కర్కాటకం: శ్రవణ నక్షత్రంలో శుక్రుడు సంచరించే కాలంలో కర్కాకట రాశి వారికి శుభాలు కలుగుతాయి. వ్యాపారులకు లాభాలు పెరగడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేయాల్సి వచ్చినా అవి ఫలప్రదంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అన్యూన్యత మరింత అధికం అవుతుంది.
(4 / 5)
సింహం: ఈ కాలం సింహరాశి వారికి ప్రయోజనకరం. అదృష్టం వీరికి చాలా విషయాల్లో వెన్నుదన్నుగా ఉంటుంది. ఉద్యోగులకు, విద్యార్థులకు చాలా విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
(Pexel)(5 / 5)
వృషభం: శ్రవణ నక్షత్రంలో శుక్రుడి సంచారం వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. చేసే చాలా పనులు విజయవంతం అవుతాయి. లక్ బాగా సపోర్ట్ చేస్తుంది. స్నేహితుల నుంచి చాలా విషయాల్లో మద్దతు దక్కుతుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు