నాలుగు నెలల పాటు ఈ నాలుగు రాశులకు అదృష్టం ఫుల్.. డబ్బు, కొత్త అవకాశాలు, గౌరవం మెండుగా!-these lucky zodiac signs may get huge benefits due to venus transit in pisces ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  నాలుగు నెలల పాటు ఈ నాలుగు రాశులకు అదృష్టం ఫుల్.. డబ్బు, కొత్త అవకాశాలు, గౌరవం మెండుగా!

నాలుగు నెలల పాటు ఈ నాలుగు రాశులకు అదృష్టం ఫుల్.. డబ్బు, కొత్త అవకాశాలు, గౌరవం మెండుగా!

Jan 21, 2025, 04:45 PM IST Chatakonda Krishna Prakash
Jan 21, 2025, 04:45 PM , IST

  • మరో వారంలో శుక్రుడు రాశి మారనున్నాడు. ఈసారి అసాధారణంగా అదే రాశిలో సుమారు నాలుగు నెలల పాటు సంచరించనున్నాడు. ఈ కాలంలో నాలుగు రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.

శుక్రుడు వచ్చే వారం జనవరి 28వ తేదీన మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. సాధారణంగా నెల కాకుండా సుమారు నాలుగు నెలల పాటు అదే రాశిలో సంచరించనున్నాడు. జనవరి 28 నుంచి మే 31వ తేదీ వరకు మీన రాశిలో శుక్రుడు సంచరిస్తాడు. ఈ కాలంలో నాలుగు రాశుల వారికి ఎక్కువగా అదృష్టం కలిసి రానుంది. ఆ వివరాలు ఇవే..

(1 / 5)

మిథునం: మీనంలో శుక్రుడి సంచారం మిథున రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. చేసే పనుల్లో ఎక్కువగా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపారులకు, ఉద్యోగులకు కొత్త అవకాశాలు తలుపుతట్టే అవకాశం ఉంది. ఆదాయం కూడా పెరుగుతుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.  

(2 / 5)

కుంభం: ఈ నాలుగు నెలల కాలంలో కుంభ రాశి వారికి కూడా శుభాలు కలుగుతాయి. ఈ కాలంలో వీరికి డబ్బుపరంగా ఎక్కువగా కలిసి వస్తుంది. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతాలు అధికం కావొచ్చు. ఆర్థికంగా పరిస్థితి మెరుగవుతుంది. కార్యాలయాల్లో గౌరవం అధికం అవుతుంది. 

(3 / 5)

కన్య: ఈ కాలంలో కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. లాభాలు పెరుగుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వీరు చేసే ప్రయాణాలు ప్రయోజనాలు ఇవ్వొచ్చు. అదృష్టం మద్దతునిస్తుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. 

(4 / 5)

వృషభం: మీనరాశిలో శుక్రుడు సంచరించే కాలంలో వృషభ రాశి వారికి ప్రయోజనాలు మెండుగా దక్కుతాయి. ధనలాభాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు పెరుగుతుంది. సమాజంలో ప్రతిష్ఠ అధికం అవుతుంది. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల గురించి తెలుసుకోవాలంటే సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు