ఈ నాలుగు రాశుల వారి దశ తిరగనుంది.. అదృష్ట యోగం, ధనప్రాప్తి, ఆనందం!
- Mercury Rise: కుంభ రాశిలో బుధుడు ఈనెలలో ఉదయించనున్నాడు. దీనివల్ల నాలుగు రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు కలగనున్నాయి. వారికి చాలా విషయాల్లో కలిసి రానుంది. ఆ వివరాలు ఇవే…
- Mercury Rise: కుంభ రాశిలో బుధుడు ఈనెలలో ఉదయించనున్నాడు. దీనివల్ల నాలుగు రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు కలగనున్నాయి. వారికి చాలా విషయాల్లో కలిసి రానుంది. ఆ వివరాలు ఇవే…
(1 / 5)
గ్రహాల రాకుమారుడు బుధుడి సంచారం వల్ల రాశుల అదృష్టం మారుతుంది. ఈనెల ఫిబ్రవరి 22న కుంభ రాశిలో బుధుడు ఉదయించనున్నాడు. సుమారు 24 రోజులు ఈ దశ ఉండనుంది. దీనివల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం ఎక్కువగా దక్కనుంది.
(2 / 5)
కుంభం: ఈ రాశిలోనే బుధుడు ఉదయించనున్నాడు. దీంతో వీరికి ఈ కాలంలో అదృష్టయోగం మెండుగా ఉంటుంది. సమాజంలో గౌరవం, కుటుంబం సంతోషం అధికం అవుతాయి. వ్యాపారులకు ధనలాభాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆత్మ విశ్వాసం కూడా మెండుగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో పరిస్థితులు కలిసి వస్తాయి.
(3 / 5)
కన్య: ఈ కాలంలో కన్యా రాశి వారికి ప్రయోజనాలు బాగా దక్కుతాయి. పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి సత్ఫలితాలు కలుగుతాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు, లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు ఈ కాలంలో ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త ఎక్కువ జాగ్రత్త వహించాలి.
(4 / 5)
వృషభం: ఈ కాలంలో వృషభ రాశి వారికి శుభాలు కలుగుతాయి. చేపట్టే పనుల్లో ఎక్కువ విజయవంతం అవుతాయి. కొత్త అవకాశాలు దక్కుతాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. చాలా విషయాల్లో అదృష్టం సహకరిస్తుంది. సమయాన్ని ఆనందంగా గడుపుతారు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు ఉంటాయి.
(5 / 5)
సింహం: బుధుడు ఉదయించడం వల్ల సింహ రాశి వారి దశ మార్చేస్తుంది. అదృష్టం మెండుగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఆస్తులు కొనాలని ప్రయత్నించే వారికి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు