రెండు గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి అదృష్టకాలం.. డబ్బు, గౌరవం ఎక్కువగా!-these four zodiac signs to get luck and benefits due to sun jupiter conjunction in gemini ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రెండు గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి అదృష్టకాలం.. డబ్బు, గౌరవం ఎక్కువగా!

రెండు గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి అదృష్టకాలం.. డబ్బు, గౌరవం ఎక్కువగా!

Published Apr 14, 2025 01:39 PM IST Chatakonda Krishna Prakash
Published Apr 14, 2025 01:39 PM IST

  • మిథున రాశిలో రెండు గ్రహాల అరుదైన కలయిక జరగనుంది. సుమారు 12 ఏళ్ల తర్వాత ఇది సంభవించనుంది. దీనివల్ల ఈ కాలంలో కొన్ని రాశుల వారికి చాలా లాభాలు దక్కనున్నాయి.

గ్రహాలు వాటి నిర్ధిష్టకాలాల్లో రాశులను మారుతుంటాయి. సంచరించే ఈ క్రమంలో కొన్నిసార్లు ఇతర గ్రహాలతో కలుస్తాయి. ఇలా త్వరలో ఓ అరుదైన కలయిక జరగనుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మిథున రాశిలో సూర్యుడు, బృహస్పతి కలవనున్నారు. ఈ ఏడాది జూన్‍లో ఇది జరగనుంది.

(1 / 6)

మే 14వ తేదీన బృహస్పతి (గురువు).. మిథున రాశిలో అడుగుపెట్టనున్నాడు. జూన్ 15న మిథున రాశిలో సూర్యుడు అడుగుపెడతాడు. దీంతో జూన్ 15న మిథునంలో గురువు, సూర్యుడి అరుదైన కలయిక ఉండనుంది. జూలై 16 వరకు మిథున రాశిలో సూర్యుడు ఉంటాడు. ఈ కాలంలో నాలుగు రాశుల వారికి చాలా ప్రయోజనాలు దక్కుతాయి.

(2 / 6)

సింహం: మిథునంలో సూర్యుడు, బృహస్పతి కలిసి సంచరించడం సింహ రాశి వారికి లాభాలు తెచ్చిపెడుతుంది. వీరికి అదృష్టం చాలా బలంగా ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మెరుగవుతుంది. డబ్బు ఆదా చేసేందుకు మార్గాల కోసం చూస్తారు.

(3 / 6)

వృషభం: మిథునంలో గురువు, సూర్యుల కలయిక వృషభ రాశి వారికి కూడా ప్రయోజనకరం. కుటుంబంలో సంతోషం ఎక్కువగా ఉంటుంది. తోబుట్టువుల మద్దతు అధికం అవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనపరమైన విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో వృద్ధి కనిపిస్తుంది.

(4 / 6)

మిథునం: ఇదే రాశిలో గురువు, సూర్యుల కలయిక సంభవించనుంది. దీంతో ఇది మిథున రాశి వారికి కూడా శుభప్రదమే. వీరికి ఈ కాలంలో అదృష్టం మద్దతును ఇస్తుంది. పెట్టుబడుల నుంచి మంచి రాబడి చూసే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు పరిస్థితులు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సత్ఫలితాలు ఉంటాయి.

(5 / 6)

కన్య: మిథునంలో సూర్యుడు, గురువు కలిసి సంచరించడం కన్యా రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ కాలంలో ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రయాణాలతో ప్రయోజనాలు ఉంటాయి. గౌరవం ఎక్కువగా దక్కుతుంది. ఎప్పటి నుంచి రావాల్సిన బకాయిలు కొన్ని వసూలు కావొచ్చు. మానసిక ప్రశాంతత ఉంటుంది. (గమనిక: విశ్వాసాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(6 / 6)

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు