(1 / 5)
ఈ వారంలోనే మార్చి 29వ తేదీన మీనరాశిలో శుక్రుడు, శని కలయిక ఉండనుంది. ఇప్పటికే మీనంలో శుక్రుడు సంచరిస్తుండగా.. మార్చి 29న శని కూడా అదే రాశిలో అడుగుపెట్టనున్నాడు. ఇది నాలుగు రాశుల వారికి బాగా కలిసివస్తుంది. మీనంలో శుక్రుడు ఉండే మే 31వ తేదీ వరకు ఈ ప్రభావం ఉంటుంది. శని, శుక్రుల కలయిక వల్ల లాభ పడే రాశులు ఏవంటే..
(2 / 5)
మిథునం: మీనంలో శుక్రుడు, శని కలిసి సంచరిచే కాలంలో మిథున రాశి వారికి శుభాలు కలుగుతాయి. ధనపరమైన ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులకు లాభాలా అధికమయ్యే ఛాన్స్ ఉంటుంది. కొందరు ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం మెరుగ్గా ఉంటుంది. కొత్త పనులు ఆరంభించవచ్చు.
(3 / 5)
మీనం: మీనరాశిలోనే శుక్రుడు, శని కలయిక జరగనుంది. దీంతో ఈ కాలంలో మీనరాశి వారికి చాలా రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా లాభాలు చేకూరతాయి. ధనపరమైన కష్టాలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. మనశ్శాంతి కలుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత, ఆనందం ఉంటాయి.
(4 / 5)
ధనూ రాశి: శుక్రుడు, శని కలయిక ఉండే కాలం ధనూ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి ఆత్మవిశ్వాసం, మానసిక ఆనందం ఎక్కువగా కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో అదృష్టం అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో బంధం మరింత బలపడుతుంది. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.
(5 / 5)
వృషభం: మీనరాశిలో శని, శుక్రుడి కలయిక వృషభ రాశి వారికి లాభదాయం. ఈ కాలంలో వీరికి సంతోషం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులకు ధనప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. పెండింగ్‍లో ఉండే కొన్ని పనులు ఈ కాలంలో పూర్తవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం లాభిస్తుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ప్రకారం ఈ సమాచారం రూపొందించాం. ఇవి అంచనాలు మాత్రమే, కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
(Pixabay)ఇతర గ్యాలరీలు