(1 / 5)
శని వచ్చే వారం మార్చి 29న మీనరాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఇప్పటికే ఆ రాశిలో శుక్రుడు, రాహువు సంచరిస్తున్నారు. అయితే, మార్చి 29న మీనరాశిలో శుక్రుడు, రాహువుతో శని కలవనుండటంతో అదే రోజు త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. సుమారు నెలన్నర దీని ప్రభావం ఉంటుంది. ఈ యోగం నాలుగు రాశుల వారికి అదృష్ట కాలాన్ని తెచ్చిపెట్టనుంది. బాగా కలిసి వస్తుంది.
(2 / 5)
మిథునం: త్రిగ్రాహి యోగం వల్ల మిథున రాశి వారికి అదృష్టయోగం ఉంటుంది. ఈ కాలంలో వీరికి ధనలాభాలు అధికంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ప్రయోజనాలను చేకూరుస్తాయి. చేసే పనుల్లో కార్యసిద్ధి ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
(3 / 5)
ధనూ రాశి: ఈ యోగం వల్ల ధనూ రాశి (ధనస్సు రాశి) వారికి బాగా కలిసి వస్తుంది. కొత్త పనులు మొదలుపెట్టేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో ప్రయోజనాలను పొందుతారు. కొందరికి వేతనాలు కూడా అధికమయ్యే ఛాన్స్ ఉంది. చాలా పనుల్లో అదృష్టం మద్దతుగా ఉంటుంది.
(4 / 5)
వృషభం: త్రిగ్రాహి యోగం కాలంలో వృషభ రాశి వారికి అదృష్టం మద్దతుగా ఉంటుంది. పెండింగ్‍లో ఉండే కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఆదాయం అధికం అవుతుంది. ఆకస్మిక ధనలాభం కలగొచ్చు. చాలా పనుల్లో సక్సెస్ అవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉంటారు.
(5 / 5)
మేషం: మీనంలో త్రిగ్రాహి యోగం ఏర్పడడం వల్ల మేష రాశి వారికి శుభప్రదం. ఈ కాలంలో వీరికి వ్యక్తిగత సంతోషం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులకు, ఉద్యోగులకు ఆర్థిపరమైన ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో గౌరవం అధికమవుతుంది. కుటుంబ సభ్యులతో బంధం మరింత బలపడుతుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల అనుసారం ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. ఇవి కేవలం అంచనాలే. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు