(1 / 5)
కేతువు ఇప్పటికే సింహ రాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 7న సింహ రాశిలోకే కుజుడు ప్రవేశించనున్నాడు. దీంతో జూన్ 7న సింహంలో కుజకేతు యోగం ఏర్పడనుంది. సింహ రాశిలో కుజుడు ఉండే జూలై 28 వరకు ఇది ఉంటుంది. కుజకేతు యోగం వల్ల నాలుగు రాశుల వారికి ఎక్కువ లాభాలు చేకూరతాయి.
(2 / 5)
కర్కాటకం: కుజకేతు యోగం కాలంలో కర్కాటక రాశి వారికి చాలా విషయాల్లో ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఏవైనా గొడవలు ఉంటే పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది. విభేదాలపై అర్థవంతంగా మాట్లాడుకుంటారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.
(3 / 5)
తుల: ఈ యోగం వల్ల తులా రాశి వారికి మేలు జరుగుతుంది. ఈ కాలంలో వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహంగా పనులు చేస్తారు. పెట్టుబడుల నుంచి రాబడి బాగా ఉంటుంది. డబ్బు విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులు, కుటుంబంతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో బంధం మరింత మెరుగుపడుతుంది.
(4 / 5)
కన్య: కుజకేతు యోగం కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో వీరికి అదృష్టం అన్నింటా తోడుగా ఉంటుంది. చాలా పనులు విజయవంతం అవుతాయి. డబ్బు ఖర్చు చేసేందుకు ఆలోచిస్తారు. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు జరగొచ్చు. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లే అవకాశాలు ఉంటాయి.
(5 / 5)
సింహం: ఈరాశిలోనే కుజుడు, కేతువు కలయికతో కుజకేతు యోగం ఏర్పడనుంది. దీంతో ఈ కాలంలో సింహ రాశి వారికి లక్ ఎక్కువగా ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది. సమజాజంలో గౌరరం అధికమవుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కొత్త పనులు మొదలుపెట్టేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం రూపొందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు