ఈ నాలుగు రాశుల వారికి రేపటి నుంచి కలిసొచ్చే కాలం.. వారం రోజులు ఎక్కువగా లక్.. ధనం, ఆనందం!-these four zodiac signs may get good fortunes and lot of benefits due to mercury transit in krittika nakshatra ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ నాలుగు రాశుల వారికి రేపటి నుంచి కలిసొచ్చే కాలం.. వారం రోజులు ఎక్కువగా లక్.. ధనం, ఆనందం!

ఈ నాలుగు రాశుల వారికి రేపటి నుంచి కలిసొచ్చే కాలం.. వారం రోజులు ఎక్కువగా లక్.. ధనం, ఆనందం!

Published May 20, 2025 04:31 PM IST Chatakonda Krishna Prakash
Published May 20, 2025 04:31 PM IST

బుధుడు.. నక్షత్రం మారనున్నాడు. దీనివల్ల నాలుగు రాశుల వారికి కాలం కలిసి రానుంది. వారం పాటు అదృష్టం వీరికి తోడుగా ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

బుధుడు మరొక్క రోజులో మే 21న కృత్తిక నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. రేపు (మే 21) రాత్రి 10.23 నిమిషాల నుంచి మే 28వ తేదీ తెల్లవారుజాము వరకు కృత్తిక నక్షత్రంలోనే సంచరిస్తాడు. ఈ వారం పాటు నాలుగు రాశుల వారికి అదృష్టం మెండుగా ఉంటుంది.

(1 / 5)

సింహం: కృత్తిక నక్షత్రంలో బుధుడు సంచరించే కాలంలో సింహ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అన్నింటా అదృష్టం మద్దతుగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో పరిస్థితులు కలిసి వస్తాయి. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు సమయం అనూకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా సమయం గడుపుతారు.

(2 / 5)

వృషభం: ఈ కాలంలో వృషభ రాశి వారికి ప్రయోజనాలు ఎక్కువగా కలుగుతాయి. ఉద్యోగులకు పనిపై ఆసక్తి పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. గౌరవం పెరుగుతుంది. ఈ కాలంలో ఈ రాశి వారు పాజిటివ్‍గా ఆలోచిస్తారు. కొత్త పనులు చేసేందుకు ఉత్సాహంగా ఉంటారు.

(3 / 5)

వృశ్చికం: కృత్తిక నక్షత్రంలో బుధుడు సంచరించే వారం పాటు వృశ్చిక రాశి వారికి లాభదాయకం. వీరికి లక్ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులకు ధనపరమైన లాభాలు బాగా కలుగుతాయి. పెళ్లి కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఇల్లు కొనాలని అనుకుంటున్న వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

(4 / 5)

తుల: కృత్తిక నక్షత్రంలో బుధుడు సంచరించడం తులా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో సమాజంలో వీరికి గౌరవం పెరుగుతుంది. అదృష్టం మద్దతులో చాలా పనులు బాగా సక్సెస్ అవుతాయి. కుటుంబంలో ఏవైనా తగాదాలు ఉంటే పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆనందంగా ఉంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించొచ్చు.)

(5 / 5)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు