మహాలక్ష్మి యోగం వల్ల ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం.. లాభాల వెల్లువ, ఆనందం!
- మహాలక్ష్మి రాజయోగం ఏర్పడడం వల్ల నాలుగు రాశుల వారికి కాలం కలిసి రానుంది. కర్కాటక రాశిలో చంద్రుడు, కుజుడి కలయికతో ఇది జరగనుంది. ఆ రాశులకు అదృష్టం ఉంటుంది.
- మహాలక్ష్మి రాజయోగం ఏర్పడడం వల్ల నాలుగు రాశుల వారికి కాలం కలిసి రానుంది. కర్కాటక రాశిలో చంద్రుడు, కుజుడి కలయికతో ఇది జరగనుంది. ఆ రాశులకు అదృష్టం ఉంటుంది.
(1 / 6)
జ్యోతిషం ప్రకారం, ఇతర గ్రహాలతో పోలిస్తే చంద్రుడు వేగంగా రాశులను మారుస్తుంటాడు. తన సంచారాల్లో ఇతర గ్రహాల కలయికతో కొన్నిసార్లు యోగాలను ఏర్పరుస్తుంటాడు. అలాగే త్వరలో మహలక్ష్మి యోగం సంభవించనుంది.
(2 / 6)
ఏప్రిల్ 3న కర్కాటక రాశిలోకి కుజుడు (అంగారకుడు) అడుగుపెట్టనున్నాడు. జూన్ 7 వరకు అదే రాశిలో ఉంటాడు. ఇంతలోనే ఏప్రిల్ 5వ తేదీ రాత్రి చంద్రుడు.. కర్కాటక రాశిలోకి ప్రవేశించునున్నాడు. కర్కాటకంలో కుజుడితో చంద్రుడు కలవటంతో ఏప్రిల్ 5న మహాలక్ష్మి రాజయోగం సంభవించనుంది. కర్కాటకంలో చంద్రుడు ఉండే ఏప్రిల్ 8వ తేదీ ఉదయం వరకు ఈ యోగం ఉంటుంది. ఈ రెండున్నర రోజులకాలంలో కొన్ని నాలుగు రాశుల వారికి మేలు జరుగుతుంది.
(3 / 6)
కన్య: కర్కాటకంలో మహాలక్ష్మి రాజయోగం వల్ల కన్యా రాశి వారికి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో వీరికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులకు అంచనాలకు మించి లాభాలు వెల్లువలా వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి ఆకస్మిక ధనం దక్కుతుంది. కొత్త పనులు మొదలుపెట్టేందుకు సమయం అనుకూలిస్తుంది.
(4 / 6)
వృషభం: మహాలక్ష్మి యోగం వల్ల వృషభ రాశి వారికి కూడా మేలు జరుగుతుంది. ఈ కాలంలో వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఆనందంగా సమయం గడుపుతారు. స్నేహితుల నుంచి మద్దతు ఎక్కువగా లభిస్తుంది. జీవిత భాగస్వామితో బంధం మరింత మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం అధికమవుతుంది.
(5 / 6)
మకరం: ఈ యోగం కాలంలో మకర రాశి వారికి పరిస్థితులు బాగా అనుకూలిస్తాయి. వ్యాపారులు, ఉద్యోగులకు ధనపరమైన లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఏవైనా వివాదాలు ఉంటే పరిష్కారం కావొచ్చు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు దక్కొచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయం అవుతుంది.
(6 / 6)
తుల: కర్కాటకంలో కుజుడు, చంద్రుడి కలయిక వల్ల ఏర్పడే మహాలక్ష్మి రాజయోగం తులా రాశి వారికి కలిసొస్తుంది. ఈకాలంలో లక్ ఎక్కువగా ఉంటుంది. చేసే పనుల్లో ఎక్కువగా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపారులకు ఆదాయం అధికమవుతుంది. ఉద్యోగులు ఉత్సాహంగా పని చేస్తారు. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల అనుసారం ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. ఇవి కేవలం అంచనాలే. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు