ఈ వారంలోనే ఈ నాలుగు రాశుల వారికి లక్కీ టైమ్ షురూ.. ధనం, సంతోషం, సక్సెస్!-these four lucky zodiac signs to get happiness and money benefits due to sun transit in capricorn ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ వారంలోనే ఈ నాలుగు రాశుల వారికి లక్కీ టైమ్ షురూ.. ధనం, సంతోషం, సక్సెస్!

ఈ వారంలోనే ఈ నాలుగు రాశుల వారికి లక్కీ టైమ్ షురూ.. ధనం, సంతోషం, సక్సెస్!

Jan 12, 2025, 07:20 PM IST Chatakonda Krishna Prakash
Jan 12, 2025, 07:20 PM , IST

  • సూర్యుడు ఈ వారంలో రాశి మారనున్నాడు. మకరంలోకి అడుగుపెట్టనున్నాడు. దీంతో నాలుగు రాశి వారికి అదృష్టం మారబోతోంది. ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆ వివరాలు ఇవే.

గ్రహాల రారాజు సూర్యుడు.. ఈ వారంలోనే జనవరి 14వ తేదీన ధనూ రాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు మకర రాశిలో సూర్యుడు సంచరించనున్నాడు. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు, అదృష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అవేవంటే..

(1 / 5)

మేషం: మకరంలో సూర్యుడి సంచారం కాలం మేషరాశి వారికి అదృష్టం మెండుగా ఉంటుంది. వీరిపై సూర్యుడి కరుణ దక్కనుంది. ఈ కాలంలో వీరికి ధనంపరంగా ప్రయోజనాలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కలగొచ్చు. 

(2 / 5)

తుల: ఈ సంచార కాలంలో తులా రాశి వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో కొందరికి ఆకస్మిక ధన లాభం కలగొచ్చు. చేసే చాలా పనుల్లో సక్సెస్ అవుతారు. పెండింగ్ పనులు కొన్ని పూర్తి అవుతాయి. వ్యాపారులకు లాభం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు పరిస్థితులు కలిగి వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 

(3 / 5)

మకరం: సూర్యుడు ఇదే రాశిలో సంచరించనున్నాడు. అందుకే మకర రాశి వారికి కూడా ఈ కాలం శుభప్రదం. పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి సత్ఫలితాలు ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. జీవితంలో సంతోషం, ఆత్మవిశ్వాసం అధికం అవుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. తలపెట్టే పనుల్లో ఎక్కువ శాతం విజయం దక్కుతుంది.

(4 / 5)

వృషభం: మకర రాశిలో సూర్యుడు సంచరించే రోజులు వృషభ రాశి వారికి లాభదాయకం. వీరికి అదృష్టం మద్దతు ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు, విద్యార్థులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశాలు మెండు. సమాజంలో గౌరవం అధికం అవుతుంది. దాంపత్య జీవితంలో సంతోషం మెరుగ్గా ఉంటుంది. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ కథనం రూపొందించాం. వీటికి కచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు తెలుసుకునేందుకు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు