శక్తివంతమైన యోగం: ఈ నాలుగు రాశుల వారికి కలిసిరానున్న లక్.. డబ్బు, గౌరవం ఎక్కువగా!
- షడష్టక యోగం ఈవారంలోనే ఏర్పడనుంది. ఈ శక్తివంతమైన యోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
- షడష్టక యోగం ఈవారంలోనే ఏర్పడనుంది. ఈ శక్తివంతమైన యోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
(1 / 5)
సూర్యుడు, కుజుడి వల్ల షడష్టక యోగం ఏర్పడనుంది. మరో రెండు రోజుల్లో ఫిబ్రవరి 7వ తేదీన ఏ యోగం సంభవించనుంది. సూర్యుడు, కుజుడు మధ్య గరిష్ట వ్యత్యాసం 150 డిగ్రీలు ఉండటంతో షడష్టక యోగం 7వ తేదీన ఏర్పడనుంది. సుమారు వారం పాటు ప్రభావం ఉంటుంది. దీనివల్ల నాలుగు రాశుల వారికి ఎక్కువగా కలిసి రానుంది.
(2 / 5)
సింహం: షడష్టక యోగం వల్ల సింహ రాశి వారికి శుభం కలుగుతుంది. వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభాలు అధికం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చేసే పనుల్లో ఎక్కువ సక్సెస్ అవుతాయి.
(Pexel)(3 / 5)
ధనస్సు: ఈ యోగం కాలంలో ధనస్సు రాశి (ధనూ రాశి) వారికి లాభాలు కలుగుతాయి. డబ్బుపరమైన విషయాల్లో బాగా కలిసి వస్తుంది. ఆస్తులు కొనాలనుకునే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.
(4 / 5)
కుంభం: ఈ యోగం వల్ల కుంభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. వాటి వల్ల కూడా లాభం కలుగుతుంది. ధనప్రాప్తి ఉంటుంది. విద్యార్థులకు కూడా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు పెరగొచ్చు.
(5 / 5)
మేషం: షడష్టక యోగం వల్ల మేషరాశి వారికి శుభాలు కలుగుతాయి. ఈ కాలంలో కొత్త అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగులకు సహచరుల నుంచి మద్దతు ఉంటుంది. చాలా కాలం నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందొచ్చు. ప్రతిష్ట పెరుగుతుంది. కొందరికి ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు