బుధుడి సంచారం: నేటి నుంచి ఈ ఐదు రాశులకు మెండుగా అదృష్టం!
సింహరాశిలోకి బుధుడు ప్రవేశించాడు. నేటి (సెప్టెంబర్ 4) నుంచి ఆ రాశిలో సంచారం మొదలుపెట్టాడు. దీనివల్ల సుమారు 20 రోజుల పాటు కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
(1 / 6)
జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడి సంచారం రాశులపై ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంది. బుధుడి రాశిచక్రం మార్పు ప్రభావం అధికంగా ఉంటుంది. నేడే అంటే సెప్టెంబర్ 4న సింహరాశిలోకి బుధుడు ప్రవేశంచాడు. సెప్టెంబర్ 23 ఉదయం వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు. దీనివల్ల ఈ కాలంలో ఐదు రాశులకు చాలా లాభాలు దక్కే అవకాశాలు ఉన్నాయి.
(2 / 6)
మిథునం: ఈ కాలం మిథున రాశి వారికి సంతోషం సిద్ధిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఉల్లాసంగా ఉంటారు.
(3 / 6)
కన్య: సింహరాశిలో బుధుడి సంచారం కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారం చేసే వారికి లాభాలు ఎక్కువగా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారికి సత్ఫలితాలు ఉంటాయి. చేసే ప్రయాణాలు ఫలవంతం అవుతాయి.
(4 / 6)
సింహం: ఈ సంచార కాలంలో సింహరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. గతం కంటే వీరి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక కష్టాలను అధిగమించొచ్చు. వ్యాపారులకు లాభం ఎక్కువగా వస్తుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు దక్కొచ్చు.
(5 / 6)
తులారాశి: ఈ కాలంలో తులా రాశి వారికి కలిసి వస్తుంది. వ్యాపారాల్లో ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది. వృత్తిపరమైన విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కష్టపడి చేసిన పనులు సఫలీకృతమవుతాయి. ఈ కాలంలో వీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగులకు కూడా ఇది మంచి సమయం.
(6 / 6)
ధనస్సు: సింహరాశిలో బుధుడి సంచారం ధనస్సు రాశి వారికి అదృష్టాన్ని పెంచుతుంది. ఈ కాలంలో వీరికి ధనప్రయోజనాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆస్తివ్యవహారాల్లోనూ సానుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో పుణ్యక్షేత్రాలకు వెళ్లవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు వారి జాతకాన్ని బట్టి విభిన్నంగా ఉండొచ్చు. సందేహాలు ఉండే సంబంధిత నిపుణుడి సంప్రదించాలి)
ఇతర గ్యాలరీలు