తెలుగు న్యూస్ / ఫోటో /
ఇండియాలో.. 2024లో లాంచ్ అయ్యే కొత్త కార్లు ఇవే!
- సరికొత్త లాంచ్‌లతో 2023లో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ కళకళలాడిపోయింది. ఇక 2024లో కూడే ఇదే కొనసాగనుంది. పలు ఎగ్జైటింగ్ వాహనాలు.. 2024లో లాంచ్ అవుతున్నాయి. ఆ వివరాలు..
- సరికొత్త లాంచ్‌లతో 2023లో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ కళకళలాడిపోయింది. ఇక 2024లో కూడే ఇదే కొనసాగనుంది. పలు ఎగ్జైటింగ్ వాహనాలు.. 2024లో లాంచ్ అవుతున్నాయి. ఆ వివరాలు..
(1 / 5)
హ్యుందాయ్ సంస్థకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది క్రేటా. ఈ క్రేటాకు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ రాబోతోంది. సరికొత్త ఫీచర్స్‌తో పాటు డిజైన్ ఛేంజ్‌తో ఈ మోడల్.. మరింత ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. 2024లో ఈ మోడల్ లాంచ్ అవుతుంది.
(2 / 5)
2023లో కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ని లాంచ్ చేసిన కియా మోటార్స్.. 2024లో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ మోడల్ కోసం అందరు ఎదురుచూస్తున్నారు.
(3 / 5)
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్‌ని 2024 తొలినాళ్లల్లో లాంచ్ చేయాలని మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇందులో కొత్తగా.. భారీ టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్ వంటివి వస్తాయట.
(4 / 5)
మారుతీ సుజుకీ స్విఫ్ట్‌తో పాటు మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్లు కూడా వచ్చే ఏడాదే మార్కెట్లోకి రానున్నాయి. 2024 మధ్యలో ఇవి కస్టమర్లను పలకరిస్తాయని టాక్ నడుస్తోంది.
ఇతర గ్యాలరీలు