Flop Players in T20 WC 2022: ఈ స్టార్ ఆటగాళ్లు సొంత జట్టుకే తలనొప్పిగా మారారు.. ఎవరంటే?-these are the players who are headache to their own team in t20 world cup 2022 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  These Are The Players Who Are Headache To Their Own Team In T20 World Cup 2022

Flop Players in T20 WC 2022: ఈ స్టార్ ఆటగాళ్లు సొంత జట్టుకే తలనొప్పిగా మారారు.. ఎవరంటే?

Nov 02, 2022, 07:35 AM IST Maragani Govardhan
Nov 02, 2022, 07:35 AM , IST

  • Super Flop Players - T20 world cup 2022: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 ఇప్పటి వరకు చాలా ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతీ జట్టులోనూ చాలా మంది ఆటగాళ్లు అద్బుత ప్రదర్శన చేస్తున్నారు. ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపిస్తున్నారు. అయితే అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న కొంతమంది ప్లేయర్లు మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. ఇప్పటి వరకు జరగిన టోర్నీలో ఈ విధంగా ఫ్లాప్ అయిన ఆటగాళ్లలో టీమిండియాను కేఎల్ రాహుల్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లాంటి వారున్నారు. టోర్నీ ప్రారంభం నుంచి వీరు అభిమానులకు నిరాశ కలిగిస్తున్నారు.

KL Rahul-టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో అతడు కేవలం 22(3, 9, 9) పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో జట్టులో అతడి చోటుపై అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క అతడు ప్లెయింగ్ ఎలెవన్‌లో ఆడతాడని కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశారు.

(1 / 6)

Kane Williamson- ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా పేలవ ప్రదర్శనతో జట్టుకు తలనొప్పిగా మారాడు. అతడు 3 మ్యాచ్‌ల్లో కలిపి 70 పరుగులు మాత్రమే చేశాడు. శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ నిదానండా ఆడి 40 బంతుల్లో 40 పరుగులతో విమర్శల పాలయ్యాడు. ఈ స్లో ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లాండ్ చేతిలో కివీస్ పరాజయం పాలైంది. ప్రపంచకప్‌లో విలియమ్సన్ స్ట్రైక్ రేట్ 93 ఉండటం గమనార్హం.

(2 / 6)

Shaheen Afridi- గత టీ20 వరల్డ్ కప్‌లో నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రీది.. ఈ టోర్నీ ముందు వరకు కూడా అత్యంత ప్రమాదకరమైన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే టోర్నీ ప్రారంభం నుంచి మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 3 మ్యాచ్‌ల్లో కలిపి అతడు ఒక్కటే వికెట్ తీశాడంటే అర్థం చేసుకోవచ్చు.

(3 / 6)

David Warner- ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ పీడకలలా మారుతుందని అస్సలు ఊహించి ఉండడు. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా విఫలమవుతున్నాడు. 3 మ్యాచ్‌ల్లో కలిపి 19 పరుగులు మాత్రమే చేశాడు. వార్నర్ ఫామ్ లేమి జట్టును బాగా దెబ్బతీస్తోంది.

(4 / 6)

Temba Bavuma- దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కూడా కొద్దికాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ టీ20 వరల్డ్ కప్‌లోనూ ఘోరంగా విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో అతడు ఇప్పటి వరకు 2, 2, 13(మొత్తం 17 పరుగులు) రన్స్ మాత్రమే చేశాడు. అయితే దక్షిణాఫ్రికా జట్టు సెమీ ఫైనల్‌కు చేరువలో ఉంటే.. వారి కెప్టెన్ మాత్రం ఫామ్ లేమితో ఉండటం కలవరపరుస్తోంది.

(5 / 6)

టీ20 వరల్డ్ కప్ 2022లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న ఆటగాళ్లు వీరే.. ఓ లుక్కేయండి

(6 / 6)

టీ20 వరల్డ్ కప్ 2022లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న ఆటగాళ్లు వీరే.. ఓ లుక్కేయండి(all photo-instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు