ప్రతి తల్లి అకౌంట్ లోకి రూ. 13 వేలు - 'తల్లికి వందనం స్కీమ్' గైడ్ లైన్స్ ఇవే-these are the guidelines for ap govt thalliki vandanam scheme 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ప్రతి తల్లి అకౌంట్ లోకి రూ. 13 వేలు - 'తల్లికి వందనం స్కీమ్' గైడ్ లైన్స్ ఇవే

ప్రతి తల్లి అకౌంట్ లోకి రూ. 13 వేలు - 'తల్లికి వందనం స్కీమ్' గైడ్ లైన్స్ ఇవే

Published Jun 12, 2025 02:42 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 12, 2025 02:42 PM IST

‘తల్లికి వందనం స్కీమ్’ మార్గదర్శకాలు వచ్చేశాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తల్లికి వందనం కింద రూ. 13 వేలు తల్లి ఖాతాలో జమవుతాయి. మిగతా రూ. 2 వేలు అభివృద్ధి పనుల కోసం మినహాయింపు ఇస్తారు. 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు పథకం ద్వారా లబ్ధి పొందుతారు. మార్గదర్శకాలెంటో ఇక్కడ తెలుసుకోండి.

 తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.అయితే తల్లుల ఖాతాలో రూ.15వేలు కాకుండా రూ.13వేలు మాత్రమే జమ కానున్నాయి, రూ.2వేలను పాఠశాలల అభివృద్ధితో పాటు నిర్వహణకు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్పష్టం చేశారు.

(1 / 8)

ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ఉండే అకౌంట్‌లకు జమ చేస్తారని ప్రభుత్వం తెలిపింది. గత వైసీపీ హయాంలో కూడా అమ్మ ఒడి కింద రూ.15వేలు అందజేశారు. అప్పుడు కూడా ఈ రూ.15వేలలో పాఠశాల నిర్వహణ కోసం రూ.వెయ్యి, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి రూ.1,000 చొప్పున మినహాయించేవారు.

(2 / 8)

2025-2026 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తారు. వీటిలో రూ. 2 వేలు కట్ కాగా.. రూ  13 వేలు తల్లుల ఖాతాల్లో జమవుతాయి.

(3 / 8)

పది వేల ఆదాయం లోపు వున్న తెల్లరేషన్ కార్డుదారులకు, నెలకు 300 యూనిట్ల కరెంట్ బిల్లు దాటకుండా ఉండే కుటుంబాలకు ఈ స్కీమ్ వర్తింపజేస్తారు. 75 శాతం అటెండెన్స్ ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని ధృవపత్రాలు, ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే డబ్బులు జమవుతాయి.

(4 / 8)

కుటుంబం యొక్క మొత్తం భూమి 3 ఎకరాల కంటే తక్కువ మాగాణి భూమి(wet land) ఉండాలి.  లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెరక / మెట్ట భూమి ( dry land )  లేదా రెండూ కలిపి 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

(5 / 8)

ఇంట్లో ఫోర్ వీలర్ (ట్యాక్స్, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపు) ఉంటే అనర్హులవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఉండొద్దు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా స్కీమ్ వర్తింపజేయరు.

(6 / 8)

 తల్లిలేని పిల్లలకు తండ్రి లేదా సంరక్షుల ఖాతాల్లో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రకటించారు. అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం వర్తింపజేస్తాని తెలిపారు.

(7 / 8)

తల్లికి వందనం జాబితాలను గ్రామ,వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే  జూన్‌ 26 వరకు స్వీకరిస్తారు. జూన్ 30న తుది జాబితాను ప్రకటిస్తారు.తల్లికి వందనం’ పథకాన్ని 67 లక్షల మంది విద్యార్థులకు వర్తింపజేయనున్నారు. ఇందుకోసం రూ.10,091 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తుంది. .

(8 / 8)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు