Baldness Remedies: బట్టతల రాకుండా ఉండాలంటే మీరు రోజూ తినాల్సిన ఆహారాలు ఇవే
- Baldness Remedies: కొన్ని ఆహారాలు తినడం వల్ల బట్టతల సమస్య రాకుండా ఉంటుంది. ఈ ఆహారాలు తినడం వల్ల వెంట్రుకలు రాలే సమస్య ఆగిపోతుంది. ఇందుకోసం ఏం తినాలో తెలుసుకోండి.
- Baldness Remedies: కొన్ని ఆహారాలు తినడం వల్ల బట్టతల సమస్య రాకుండా ఉంటుంది. ఈ ఆహారాలు తినడం వల్ల వెంట్రుకలు రాలే సమస్య ఆగిపోతుంది. ఇందుకోసం ఏం తినాలో తెలుసుకోండి.
(1 / 5)
వెంట్రుకలు రాలిపోయి ఎంతో మంది జుట్టు పలుచగా మారిపోతుంది. కొంతమందికి బట్టతల కూడా వచ్చేస్తుంది. వారసత్వంగా వచ్చే బట్టతలను నివారించడం కష్టం కానీ, పోషకాహారలోపం లేదా కాలుష్యం వల్ల వచ్చే బట్టతలను మాత్రం ఆపవచ్చు. ఇందుకోసం కొన్ని రకాల ఆహారాలను ప్రతి రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి చాలా పోషకాలు అవసరం. కొన్ని ఆహారాలలో జుట్టును మూలాల నుండి బలోపేతం చేస్తాయి. వెంట్రుకలు రాలిపోకుండా అడ్డుకునేందుకు ఏ ఆహారాలు తినాలో తెలుసుకుందాం.
(Freepik)(2 / 5)
పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఫోలేట్, విటమిన్ సి ఉన్నాయి. ఇది జుట్టును విరగకుండా కాపాడుతుంద. వెంట్రుకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది.
(Freepik)(3 / 5)
పుల్లని పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది మహిళలకు చాలా ముఖ్యం. అంతేకాకుండా ఇందులో విటమిన్ బి 5 ఉంటుంది. ప్రతిరోజూ కప్పు పెరుగు తినాల్సిన అవసరం ఉంది. దీన్ని రోజూ తినడం వల్ల మెదడులో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
(Freepik)(4 / 5)
చిలగడ దుంపల్లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జుట్టు పొడిబారడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. జుట్టులో తేమ పదిలంగా ఉంటుంది. చీలిపోయిన జుట్టు చివరల సమస్య కూడా తగ్గుతుంది.
(Freepik)ఇతర గ్యాలరీలు