(1 / 8)
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం "రాజీవ్ యువ వికాసం" పథకాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ ను తీసుకువచ్చారు.
(2 / 8)
ఈ స్కీంలో భాగంగా అర్హులైన యువతకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ పథకం కోసం రూ.6 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 17 వ తేదీని ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
(3 / 8)
అర్హులైన వారు ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. స్కీమ్ కు ఎంపికైతే 60 శాతం నుంచి 80 శాతం వరకు సబ్సిడీని కూడా పొందవచ్చు.
(4 / 8)
ఈ స్కీమ్ కింద 160కి పైగా విభాగాలు ఉన్నాయి. ఇవన్నీ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, అగ్రోస్, ట్రాన్స్ పోర్ట్ కేటగిరిలో ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అర్హతలకు అనుగుణంగా.. యూనిట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ యూనిట్ పై ఎంత వరకు రాయితీ వస్తుందో కూడా వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. https://demo4.cgg.gov.in/TGOBMMSESSFORMS/ లింక్ పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
(5 / 8)
ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవటానికి ఆధార్ నెంబర్, ఆధార్ కార్డు ప్రకారం దరఖాస్తుదారుడి పేరు, ఆహార భద్రత కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. ఇవే కాకుండా పాన్ కార్డు ,పాస్‌పోర్టు సైజు ఫోటో, లబ్ధిదారుడి ఫోన్ నంబర్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
(6 / 8)
తొలుత అధికారిక పోర్టల్ https://tgobmms.cgg.gov.in/ కు వెళ్లాలి. రాజీవ్ యువ వికాసం స్కీమ్ అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల వారీగా ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ఆప్షన్ ను ఎంచుకోవాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రాథమిక వివరాలను నింపాల్సి ఉంటుంది. పేజీ చివర్లో యూనిట్ల వివరాలు తెలుసుకునే లింక్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే యూనిట్లు వివరాలు తెలుసుకోవచ్చు.
(7 / 8)
బీసీ కేటరిగిలోని యూనిట్ల వివరాలు తెలుసుకునేందుకు https://demo4.cgg.gov.in/TGOBMMSESSFORMS/CommonRegistration.action లింక్ పై క్లిక్ చేయండి. ఎస్సీ కేటగిరిలో యూనిట్ల వివరాల కోసం https://demo4.cgg.gov.in/TGOBMMSESSFORMS/getESSReport.action?corpId=1&financialYear=2024-25 లింక్ పై నొక్కండి.
(8 / 8)
ఎస్టీ కేటగిరిలో యూనిట్ల వివరాల కోసం https://demo4.cgg.gov.in/TGOBMMSESSFORMS/CommonRegistration.action లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. మైనార్టీ కేటరిగి కింద ఉన్న యూనిట్ల వివరాల కోసం https://demo4.cgg.gov.in/TGOBMMSESSFORMS/getESSReport.action?corpId=18&financialYear=2024-25 లింక్ పై క్లిక్ చేయండి.
ఇతర గ్యాలరీలు