హనుమాన్ జయంతి రోజున ఈ 5 రాశుల వారికి అదృష్టం.. ధనలాభంతో పాటు మరిన్ని ప్రయోజనాలు!
Hanuman Jayanti 2024 - Lucky Zodiac Signs: హనుమాన్ జయంతిని ఏప్రిల్ 23వ తేదీన జరుపుకోనున్నాం. ఆరోజున కొన్ని రాశుల వారికి బాగా కలిసివస్తుంది. ధనప్రాప్తితో పాటు మరిన్ని ప్రయోజనాలు చేకూరొచ్చు. ఆ వివరాలివే..
(1 / 6)
కార్తిక పౌర్ణమి అయిన ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం రోజున హనుమాన్ జయంతి పర్వదినం ఉంది. ఆరోజున మీనరాశిలో బుధాదిత్య యోగం, శశ రాజయోగం, పంచగ్రాహి యోగాల కలయిక ఉంది. హనుమాన్ జయంతి మరుసటి రోజున శుక్రుడు, బృహస్పతి కలయికలో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి రోజున 5 రాశుల వారికి కొన్ని లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.
(2 / 6)
మేషరాశి: హనుమాన్ జయంతి రోజున మేషరాశి వారికి ఆర్థిక లాభం చేకూరుతుంది. సంపదకు మార్గం సుగమమం అవుతుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. వైవాహిక జీవితంలోనూ సంతోషం కలుగుతుంది.
(3 / 6)
మిథున రాశి: హనుమాన్ జయంతి రోజున మిథున రాశి వారు రుణ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. ఆంజనేయుడి ఆశీస్సులతో ఆరోజున కొత్త పనులు మొదలుపెడితే సత్ఫలితాలు ఉంటాయి. విజయం సిద్ధిస్తుంది.
(4 / 6)
కర్కాటక రాశి: హనుమాన్ జయంతి రోజున కొత్త పనులు ప్రారంభిస్తే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. జీవిత భాగస్వామితో బంధం మరింత మెరుగుపడుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లభిస్తాయి. ఇది ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలకు కూడా తీసుకొస్తుంది.
(5 / 6)
వృశ్చిక రాశి: హనుమాన్ జయంతి రోజున వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. సంతానం గురించిన శుభవార్తలు కొందరికి అందే అవకాశం ఉంటుంది. చాలా కాలం నుంచి పెండింగ్ పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ అన్వేషణ సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఇతర గ్యాలరీలు