బుధాదిత్య రాజయోగం: ఈ 3 రాశుల వారికి కార్యసిద్ధి, అదృష్ట కాలం.. ఆర్థిక విషయాల్లో కలిసి వస్తుంది!
- బుధాదిత్య రాజయోగం ఈవారంలో ఏర్పడనుంది. సూర్యుడు, బుధుడి కలయికతో ఇది జరగనుంది. ఇది మూడు రాశుల వారికి శుభకరంగా ఉండనుంది.
- బుధాదిత్య రాజయోగం ఈవారంలో ఏర్పడనుంది. సూర్యుడు, బుధుడి కలయికతో ఇది జరగనుంది. ఇది మూడు రాశుల వారికి శుభకరంగా ఉండనుంది.
(1 / 5)
జ్యోతిషం ప్రకారం, ఒకే రాశిలో సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇప్పుడు మరోసారి ఈ యోగం సంభవించనుంది. ఈ వారంలో ఈ యోగం ఏర్పడనుంది.
(2 / 5)
మీనరాశిలో బుధాదిత్య రాజయోగం మార్చి 14న ఏర్పడనుంది. బుధుడు ఇప్పటికే మీనరాశిలో సంచరిస్తుండగా.. మార్చి 14న సూర్యుడు ఆ రాశిలో అడుగుపెట్టనున్నాడు. దీంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. మీనంలో బుధుడు సంచరించే ఏప్రిల్ 14వ తేదీ తెల్లవారుజాము వరకు ఈ యోగం ఉంటుంది. ఇది మూడు రాశుల వారికి శుభాలు కలుగజేస్తుంది.
(3 / 5)
మిథునం: బుధాదిత్య రాజయోగం వల్ల మిథున రాశి వారికి మేలు జరుగుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొత్త పనులు మొదలుపెట్టేందుకు ఉత్సాహంగా ఉంటారు. అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. చేసే పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారులకు అన్ని విధాల కలిసి వస్తుంది.
(4 / 5)
కుంభం: ఈ యోగ కాలంలో కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు ఆశించిన స్థాయిలో లాభాలు ఉంటాయి. చేపట్టే పనుల్లో ఎక్కువ కార్యాల్లో విజయం ఉంటుంది. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఉద్యోగులకు ధనపరమైన ప్రయోజనాలు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తోబుట్టుల మద్దతు మెండుగా ఉంటుంది.
(5 / 5)
వృషభం: బుధాదిత్య రాజయోగం ఉండే కాలంలో వృషభ రాశి వారికి చాలా విషయాల్లో తిరుగు ఉండదు. అదృష్ట యోగం ఉంటుంది. ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులకు సమయం అనుకూలిస్తుంది. కుటుంబంలో సంతోషం నిండుగా ఉంటుంది. వీరు ఆరోగ్యం పట్ల మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. (గమనిక: విశ్వాసాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)
ఇతర గ్యాలరీలు