(1 / 5)
సూర్యునిపై శని వక్ర దృష్టి మూడు రాశుల వారిని అకస్మాత్తుగా ధనవంతులుగా మార్చే అవకాశం ఉంది. మే 15 నుండి వీరి జీవితమే మారిపోవచ్చు. మే 15న వృషభ రాశిలోకి సూర్యసంచారం జరగబోతోంది.
(2 / 5)
ప్రస్తుతం సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు. మే 15న వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. వృషభరాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మీన రాశిలో ఉన్న శని.. సూర్యుడిని వక్ర దృష్టితో చూస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది.
(3 / 5)
శని వక్రదృష్టి సూర్య భగవానుడిపై ఉండడం వల్ల మేషరాశి వారు అదృష్టవంతులుగా మారుతారు. వీరికి ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. పదోన్నతి కూడా దక్కుతుంది. కొత్త కారు లేదా ఆస్తి కొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
(4 / 5)
కర్కాటక రాశి వారికి కూడా సూర్యసంచారం ఎంతో మేలును కలుగజేస్తుంది. ఈ సమయం వారికి కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైనది. అప్పుగా ఇచ్చిన డబ్బును వసూలు చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
(5 / 5)
కుంభ రాశి వారికి సూర్యభగవానుడిపై శని వక్ర దృష్టి సానుకూలతను పెంచుతుంది. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. పని ప్రదేశంలో ప్రశంసలు దక్కుతాయి.
ఇతర గ్యాలరీలు