TG Indiramma Housing Survey Updates : ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో 'ఎడిట్ ఆప్షన్' ఉంటుందా..? ఈ విషయాలను తెలుసుకోండి
- TG Indiramma Housing Survey Updates: ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తి అయింది. సంక్రాంతిలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే దరఖాస్తుదారుడు ఇచ్చే వివరాలు క్లియర్ గా ఉండాలని సర్వేయర్లు సూచిస్తున్నారు. సబ్మిట్ చేస్తే సర్వే పూర్తవుతుందని.. ఎడిట్ ఆప్షన్ ఉండదంటున్నారు.
- TG Indiramma Housing Survey Updates: ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తి అయింది. సంక్రాంతిలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే దరఖాస్తుదారుడు ఇచ్చే వివరాలు క్లియర్ గా ఉండాలని సర్వేయర్లు సూచిస్తున్నారు. సబ్మిట్ చేస్తే సర్వే పూర్తవుతుందని.. ఎడిట్ ఆప్షన్ ఉండదంటున్నారు.
(1 / 8)
తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. సంక్రాంతిలోపే పూర్తి స్థాయిలో సర్వే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలోని సర్వేయర్లు దరఖాస్తుదారుడి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
(2 / 8)
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. ఈ వివరాల జాబితా ఇప్పటికే సర్వేయర్ల వద్దకు చేరింది. వారి వద్ద విన్న వివరాల ప్రకారమే సర్వే చేస్తున్నారు.
(3 / 8)
ఇప్పటి వరకు చాలా జిల్లాల్లో 50 శాతానికి పైగా సర్వే పూర్తి అయింది. అయితే డిసెంబర్ 31వ తేదీలోపు సర్వే ప్రక్రియ ముగించాలని సర్కార్ భావిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో సాంకేతిక ఇబ్బందులు ఉండటంతో… సర్వేయర్లు ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి మొదటి వారం లేదా సంక్రాంతిలోపు సర్వేయ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
(4 / 8)
(5 / 8)
(6 / 8)
(7 / 8)
యాప్ లో వివరాలు నమోదు చేసే సమయంలో 'Save' స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఎడిట్ చేసుకునే వీలు ఉందని.. ఒక్కసారి సబ్మిట్(Submit) చేస్తే సర్వే పూర్తైపోతుందని చెప్పారు. సబ్మిట్ చేసిన తర్వాత దరఖాస్తుదారుడి వివరాలను ఎడిట్ చేసే అవకాశం లేదని సదరు సర్వేయల్ పేర్కొన్నారు.
(8 / 8)
ప్రస్తుతం జరుగుతున్న సర్వే జనవరి మొదటి వారం లేదా సంక్రాంతి లోపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే సర్వే పూర్తి తర్వాత… లబ్ధిదారుల జాబితాను ఎలా ఎంపిక చేస్తారనేది అందరిలోనూ ఆసక్తిని పుట్టిస్తోంది. లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావటంతో.. అర్హత కలిగిన వారిని గుర్తించటం సవాల్ గా మారిపోయింది. అయితే గ్రామ సభ ఆమోదం తర్వాతనే… ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.ఈ పేర్లకే జిల్లా కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుందని సమాచారం.
ఇతర గ్యాలరీలు