TG New Ration Cards : 'మీసేవా' కేంద్రాల వద్ద బారులు..! రేషన్ కార్డు దరఖాస్తులపై తాజా అప్డేట్ ఇదే
- New Ration Cards in Telangana : కొత్త రేషన్‌కార్డులకు మీసేవాలో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. దీంతో చాలా మంది మీసేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. రద్దీ పెరగడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొత్త దరఖాస్తుల ప్రక్రియపై కీలక ప్రకటన చేశారు.
- New Ration Cards in Telangana : కొత్త రేషన్‌కార్డులకు మీసేవాలో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. దీంతో చాలా మంది మీసేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. రద్దీ పెరగడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొత్త దరఖాస్తుల ప్రక్రియపై కీలక ప్రకటన చేశారు.
(1 / 8)
కొత్త రేషన్ కార్డుల జారీని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆఫ్ లైన్ లోనే కాకుండా ఇటీవలే మీసేవా ఆన్ లైన్ కేంద్రాల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటికే ఈ సేవలు అందుబాటులోకి కూడా వచ్చాయి.
(2 / 8)
‘మీసేవా’ కేంద్రాల్లో రేషన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావటంతో ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద భారీగా రద్దీ నెలకొంది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
(3 / 8)
రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులతో పాటు కొత్త కార్డుల కోసం పెద్ద సంఖ్యలో అప్లికేషన్ చేసుకునేందుకు తరలి వస్తున్నారు. దీంతో మీసేవా కేంద్రాలన్నీ జనాలతో కిక్కిరిసిపోతున్నాయి.
(4 / 8)
రేషన్ కార్డుల కోసం భారీగా ప్రజలు తరలివస్తుండటంతో మీసేవా సర్వర్లపై ప్రభావం పడుతోంది. కొన్నిచోట్ల సర్వర్లు కూడా మొరాయిస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో కొన్నిచోట్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది.
(5 / 8)
మీసేవా కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతుండటం, సర్వర్లు మొరాయిస్తుండటంతో దరఖాస్తుదారులు టెన్షన్ పడుతున్నారు. అప్లికేషన్ల గడువు ఎక్కడ పూర్తవుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది.
(6 / 8)
‘రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని పౌరసరఫరశాఖ స్పష్టం చేసింది. అప్లికేషన్ల సమర్పణకు ఎలాంటి గడువు లేదని క్లారిటీ ఇచ్చింది. దరఖాస్తుదారులు తొందరపడాల్సిన అవసరం లేదని పేర్కొంది.
(7 / 8)
రేషన్ కార్డుల విషయంలో గందరగోళానికి గురి కావొద్దని పౌరసరఫరాల శాఖ సూచించింది. ప్రజాపాలన లేదా గ్రామసభలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయవద్దని తెలిపింది.
ఇతర గ్యాలరీలు