'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్'లో వయోపరిమితి నిబంధన ఉందా..? ఇదిగో క్లారిటీ-there is no age limit for beneficiaries of indiramma housing scheme latest updates here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్'లో వయోపరిమితి నిబంధన ఉందా..? ఇదిగో క్లారిటీ

'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్'లో వయోపరిమితి నిబంధన ఉందా..? ఇదిగో క్లారిటీ

Published May 31, 2025 12:30 PM IST Maheshwaram Mahendra Chary
Published May 31, 2025 12:30 PM IST

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ మొదటి వారంలోపు లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ కాపీలను అందజేయనున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపికలో వయోపరిమితి కూడా చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటికి చెక్ పెడుతూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగానూ అన్ని గ్రామాలకు సంబంధించి అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

(1 / 8)

దరఖాస్తుల పరిశీలన తర్వాత… ఇందిరమ్మ కమిటీల సాయంతో అధికారులు లబ్ధిదారుల జాబితాలను రూపొందించారు. ఈ జాబితాలో ఉన్న పేర్లను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్న అధికారులు… లబ్ధిదారుల లిస్ట్ ను ఖరారు చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ గ్రామాలు కాకుండా… మొదటి విడత కింద పెద్ద సంఖ్యలో లబ్ధిదారులను గుర్తిస్తున్నారు.

(2 / 8)

పైలెట్ గ్రామాల్లో లబ్ధిదారులుగా గుర్తించినవారు… నిర్మాణ పనులు చేస్తున్నారు. చాలాచోట్ల ముగ్గుపోయటం నుంచి బేస్ మెంట్ వరకు పనులు పూర్తయ్యాయి, వీరి నిర్మాణ పనులను బట్టి డబ్బులను కూడా జమ చేస్తున్నారు. అయితే మొదటి విడత కింద…. ఎంపికైన లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ కాపీలను అందజేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను మొదటి వారంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

(3 / 8)

అయితే ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపులో వయోపరిమితి కూడా చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వయోపరిమితి నిబంధన తెరపైకి రావటంతో… 60 ఏళ్లు దాటినవాళ్లు ఆందోళన చెందుతున్నారు. తమకు ఇళ్ల మంజూరు చేయారా అని టెన్షన్ పడుతున్నారు.

(4 / 8)

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారుల వయోపరిమితి విషయం తెరపైకి వస్తున్న నేపథ్యంలో… రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. లబ్ధిదారులకు ఎలాంటి వయోపరిమితి లేదని స్పష్టం చేశారు. వయోపరిమితితో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించిన అర్హతలు ఉంటే…. స్కీమ్ వర్తింపజేస్తారని చెప్పారు. మంత్రి ప్రకటనతో వయోపరిమితి విషయంలో క్లారిటీ వచ్చింది.

(5 / 8)

స్వయంగా మంత్రి పొంగులేటి ప్రకటనతో… క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది కూడా వయోపరిమితి విషయంలో మరింత స్పష్టత వచ్చినట్లు అయింది. తద్వారా… లబ్ధిదారుల ఎంపికలో మరో ఇబ్బందిని అధిగమించినట్లు అయింది.

(6 / 8)

ఇక ఈ స్కీమ్ కింద….. బేస్మెంట్ పూర్తైన త‌ర్వాత ల‌క్ష రూపాయిలు, గోడ‌లు పూర్తైన త‌ర్వాత 1.25 ల‌క్షల రూపాయిలు, శ్లాబ్ పూర్తిచేసుకున్న త‌ర్వాత 1.75 ల‌క్షల రూపాయిలు, ఇల్లు పూర్తైన త‌ర్వాత మిగిలిన ల‌క్ష రూపాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

(7 / 8)

అనర్హులకు ఇవ్వకుండా పక్కాగా అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైనా అధికారులు, సిబ్బంది తప్పుడు సమాచారం ఇస్తే… వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరిస్తోంది. ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా స్కీమ్ అమలు చేయాలని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తోంది.

(8 / 8)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు