I Phones Robbery: రెండున్నర కోట్ల ఖరీదైన ఐఫోన్ల చోరీ.. బీహార్ వరకు వెంటాడి పట్టుకున్న బెజవాడ పోలీసులు
- I Phones Robbery: విజయవాడ ఐఫోన్ వేర్ హౌస్‌లో చోరీకి గురైన రెండున్నర కోట్ల విలువైన ఐఫోన్ల దోపిడీని పోలీసులు చేధించారు. బీహార్ వరకు వెంటాడి మరీ నిందితుల్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.సంచలనం రేపిన ఈ ఘటనలో సవాళ్లను అధిగమించి కేసు దర్యాప్తును కొలిక్కి తెచ్చారు.
- I Phones Robbery: విజయవాడ ఐఫోన్ వేర్ హౌస్‌లో చోరీకి గురైన రెండున్నర కోట్ల విలువైన ఐఫోన్ల దోపిడీని పోలీసులు చేధించారు. బీహార్ వరకు వెంటాడి మరీ నిందితుల్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.సంచలనం రేపిన ఈ ఘటనలో సవాళ్లను అధిగమించి కేసు దర్యాప్తును కొలిక్కి తెచ్చారు.
(1 / 5)
విజయవాడలో సంచలనం సృష్టించిన ఐ ఫోన్ల చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఎనికేపాడులోని ఐఫోన్లను మార్కెటింగ్ చేసే ఇన్‌గ్రామ్ మైక్రో ఇండియా వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో రెండున్నర కోట్ల విలువ చేసే ఫోన్లు చోరీకి గురయ్యాయి. నిందితులు గోడౌన్ పైభాగంలో రేకులు తొలగించి ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చోరీ చేశారు.
(2 / 5)
యూపీకి చెందిన నిందితులు ఈ చోరీకి పాల్పడ్డారు. చోరీ సమయంలో సీసీ కెమెరాలను తొలగించినా, వాటిలో నిందితులు స్పష్టంగా రికార్డ్ అయ్యారు. యూపీకీ చెందిన దీప్ చంద్ర ప్రజాపతి నేతృత్వంలో ముఠా విజయవాడలో చోరీకి పాల్పడింది. విశాఖ నుంచి విజయవాడ వరకు చోరీకి అనువైన గోడౌన్లను గుర్తించి రెక్కీ నిర్వహించినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
(3 / 5)
విజయవాడలో హైవే మీద ఉన్న గోడౌన్‌లో నిందితులు చోరీకి పాల్పడ్డారు. గోడౌన్ పైభాగంలో ఉన్న రేకుల్ని కత్తిరించి అందులో ప్రవేశించారు. అట్టపెట్టెల్లో ఉన్న రూ.2,51, 23, 072.86 విలువైన 271 ఐఫోన్లు, మరో 101 లెనోవో ట్యాబ్స్ అపహరించారు. మొత్తం 373 వస్తువులు చోరీకి గురయ్యాయి. సీసీ టీవీల్లో నిందితుల్లో ఒకరితో పాటు తెల్ల ఎర్తీగా కారును గుర్తించారు. కారును సాంకేతిక పరిజ్ఞానంతో యూపీకి చెందిన వాహనంగా గుర్తించడంతో కేసును చేధించారు. నిందితులు అప్పటికే బీహార్‌లోని సాసారం టోల్ ప్లాజా వరకు ప్రయాణించారు.
(4 / 5)
నిందితులు యూపీకి వెళ్లిపోతున్నట్టు గుర్తించి బీహార్ పోలీసుల్ని అప్రమత్తం చేశారు. బీహార్ శివసాగర్ పీఎస్ పోలీసుల్ని అప్రమత్తం చేశారు. డెహ్రీ జిల్లా పోలీసులతో పాటు బీహార్ డీజీపీని పోలీసులు అలర్ట్ చేశారు. దీంతో బీహార్ పోలీసులు యూపీ దోపిడీ ముఠాను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని బీహార్ కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులు నేపాల్‌లో అమ్మేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బీహార్ కోర్టు అనుమతితో విజయవాడ పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
(5 / 5)
విజయవాడలో చోరీ చేసిన 271 ఐఫోన్లను భారత్‌లో విక్రయిస్తే వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని భావించి నేపాల్‌లో అమ్మే ఏర్పాట్లు చేసుకున్నారు. 271 ఐఫోన్లను ఖాట్మాండ్‌లో విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. నేపాల్‌కు చెందిన రంజిత్ అనే నిందితుడితో ఇందుకు ఒప్పందం చేసుకున్నారు. నేపాల్ చేరకముందే దోపిడీ ముఠాను అరెస్ట్ చేశారు. నిందితులు దీప్ చంద్ ప్రజాపతి, మాయ జయప్రకాష్,సునీల్ కుమార్ సరోజ్, బ్రిజేష్ కుమార్ ఉగ్ర, మిథిలేష్ కుమార్, సురేంద్ర కుమార్ పటేల్‌లను అరెస్ట్ చేశారు.
ఇతర గ్యాలరీలు