AP TG Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, కోస్తాలో వడగాల్పులతో విలవిల..
- AP TG Weather Update: తెలుగు వేసవి ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏపీకే పరిమితమైన ఎండలు క్రమంగా తెలంగాణలో కూడా అధికం అవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగదల నమోదవుతోంది. ఏపీ తెలంగాణల్లోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP TG Weather Update: తెలుగు వేసవి ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏపీకే పరిమితమైన ఎండలు క్రమంగా తెలంగాణలో కూడా అధికం అవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగదల నమోదవుతోంది. ఏపీ తెలంగాణల్లోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
(1 / 9)
ఏపీ, తెలంగాణల్లోని పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా మార్పు కనిపిస్తోంది.
(unsplash.com)(2 / 9)
తెలంగాణలో ఎండ తీవ్రత కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకు 33 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు కొద్ది జిల్లాల్లోనే నమోదైనా ఆదివారం మాత్రం 29 జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగానే గరిష్ఠ ఉష్ణో గ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
(3 / 9)
తెలంగాణలో తెలంగాణలో రాబోయే 5 రోజులు 36-40 డిగ్రీల మధ్య నమోదు అవుతాయి. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నల్గొండ జిల్లా చిట్యాలలో 39.8 డిగ్రీలు నమోదు అయ్యాయి..
(unsplash.com)(4 / 9)
హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసి పాబాద్, మహబూబాబాద్, మేడ్చల్, నారాయణ్పాట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లో 39.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
(5 / 9)
గ్రేటర్ హైదరాబాద్ లోనూ భానుడి ప్రతాపం కొనసాగుతోంది. మార్చి రెండోవారంలోనే పగటి ఉష్ణోగ్రతలు 37-38 డిగ్రీలు నమోదవుతుండు. టంతో మధ్యాహ్నం ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు.
(Photo Source From unsplash.com)(6 / 9)
మరో వారం రోజుల్లో పగటి పూట: ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదివారం హకీంపే టలో అత్యధికంగా 37.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి.
(7 / 9)
ఎండ తీవ్రత పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఎండల ప్రభావంతో గ్రేటర్లో ఇప్పటికే విద్యుత్ డిమాండ్ 3700 మెగావాట్లకు చేరింది. ఈ నెల చివరి నాటికి విద్యుత్ డిమాండ్ 4 వేల మెగావాట్లు దాటుతుందని అంచనా. రాబోయే 5 రోజుల పాటు 36-40 డిగ్రీల మధ్య సగటు ఉష్ణోగ్ర తలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
(8 / 9)
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం, వరరామ చంద్రాపురం మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపుతాయి. మంగళవారం
పార్వతీపురంమన్యం జిల్లా - గరుగుబిల్లి,గుమ్మ లక్ష్మిపురం, జియమ్మవలస, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం… అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి, నెల్లిపాక,వైరామవరం
ఏలూరు జిల్లా - కుకునూర్, వేలేర్పాడు మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు అధికారులు తెలిపారు.
(9 / 9)
మంగళవారం ఏపీలో 39 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఆదివారం నంద్యాల జిల్లా ఆలమూరులో 40.3°C, కర్నూలు జిల్లా లద్దగిరిలో 39.6°C,వైఎస్సార్ జిల్లా నల్లచెరువుపల్లిలో 39.4°C, సత్యసాయి జిల్లా కుటగుల్ల మరియు పెనుకొండలో 38.9°సి అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 7 మండలాల్లో వడగాల్పులు వీచాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇతర గ్యాలరీలు