TG Indiramma Housing Scheme : మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ..! తాజా అప్డేట్స్ ఇవిగో
- TG Indiramma Housing Scheme Updates: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పథకం ఇవాళ లాంచనంగా పట్టాలెక్కనుంది. కేవలం మండల పరిధిలోని ఒక్క గ్రామంలోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అయితే పూర్తిస్థాయి జాబితాలు ఎప్పుడు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై తాజా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…..
- TG Indiramma Housing Scheme Updates: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పథకం ఇవాళ లాంచనంగా పట్టాలెక్కనుంది. కేవలం మండల పరిధిలోని ఒక్క గ్రామంలోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అయితే పూర్తిస్థాయి జాబితాలు ఎప్పుడు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై తాజా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…..
(1 / 8)
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కనుంది. గ్రామసభల్లో అర్హుల జాబితాలను ప్రకటించారు. అయితే వీటిని పరిశీలించి… ఫైనల్ లిస్టులను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
(2 / 8)
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ఇవాళ స్కీమ్ ను లాంచనంగా ప్రారంభిస్తారు. కొంతమంది లబ్ధిదారులకు ప్రోసిడీంగ్స్ కాపీలను అందజేయనున్నారు.
(3 / 8)
రాష్ట్రంలోని ప్రతి మండలంలోని ఒక్కో గ్రామంలో మాత్రమే ప్రస్తుతం ఈ స్కీమ్ అమలు కానుంది. అయితే మిగతా గ్రామాల్లో లబ్ధిదారులను ఎప్పుడు గుర్తిస్తారనేది ఉత్కంఠను రేపుతోంది. మరోవైపు భారీస్థాయిలో ఆశావహులు ఈ స్కీమ్ కోసం ఎదురుచూస్తున్నారు.
(4 / 8)
ప్రస్తుతం ఒక గ్రామంలోనే లాంఛనంగా ప్రారంభిస్తుండగా… అన్ని గ్రామాల్లోనూ త్వరలోనే ఈ స్కీమ్ ను పట్టాలెక్కించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కొత్త వారి నుంచి కూడా ఇందిరమ్మ ఇంటి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే వీటిని కూడా పరిశీలించాలని నిర్ణయించింది. ఇందులో అర్హత గల వారి పేర్లను కూడా పరిశీలించి… గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించింది.
(5 / 8)
లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం షెడ్యూల్ ను ప్రకటిస్తామని తాజాగా గృహా నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అర్హత గల ప్రతి ఒక్కర్నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
(6 / 8)
ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి వరకు కూడా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విడుదలైన అర్హత జాబితాలోని పేర్లతో పాటు కొత్త దరఖాస్తులను కూడా పరిశీలించనుంది. అర్హత గల వారి వివరాలను మరోసారి అన్ని కోణాల్లో పరిశీలించనున్నారు. ఇందిరమ్మ కమిటీల సాయంతో లబ్ధిదారులను గుర్తించనున్నారు.
(7 / 8)
మొత్తంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా కూడా మార్చి వరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించే అవకాశం ఉంది. మరోవైపు స్కీమ్ అమలు విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రత్యేక వెబ్ సైట్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
(8 / 8)
మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను నాలుగు ధపాలుగా జమ చేయనున్నారు. తుది జాబితాలకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆమోదం కూడా తప్పనిసరి. ఆ తర్వాతే కలెక్టర్ పరిశీలించి… ఫైనల్ లిస్టును ఖరారు చేస్తారు.
ఇతర గ్యాలరీలు