TG New Ration Card Updates : ఆఫ్‌లైన్‌లోనే కొత్త 'రేషన్ కార్డు' దరఖాస్తులు...! ఇవిగో తాజా అప్డేట్స్-the process of issuing new ration cards in telangana will start from january 26 latest updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg New Ration Card Updates : ఆఫ్‌లైన్‌లోనే కొత్త 'రేషన్ కార్డు' దరఖాస్తులు...! ఇవిగో తాజా అప్డేట్స్

TG New Ration Card Updates : ఆఫ్‌లైన్‌లోనే కొత్త 'రేషన్ కార్డు' దరఖాస్తులు...! ఇవిగో తాజా అప్డేట్స్

Jan 05, 2025, 08:27 AM IST Maheshwaram Mahendra Chary
Jan 05, 2025, 08:27 AM , IST

  • TG New Ration Card Updates : కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమైంది. ఈనెల 26వ తేదీ నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ తేదీ కంటే ముందే దరఖాస్తులను కూడా స్వీకరించనున్నారు. ఆఫ్ లైన్ లోనే అప్లికేషన్లను స్వీకరిస్తారని తెలిసింది. తాజా అప్డేట్స్ ఇవే….

సంక్రాంతి వేళ తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్‌కార్డుల జారీ చేయాలని నిర్ణయించింది. 

(1 / 8)

సంక్రాంతి వేళ తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్‌కార్డుల జారీ చేయాలని నిర్ణయించింది. 

జనవరి 26వ తేదీన నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇదే  నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డును జారీ చేస్తామని చెప్పారు. చాలా కాలంగా రేషన్ కార్డుల సమస్య నెలకొందని.. ఈ సమస్యలకు పరిష్కారం చూపుతూ… ఈనెల 26 నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

(2 / 8)

జనవరి 26వ తేదీ నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించగా… అంతకంటే ముందే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ ఈనెల రెండో వారం లేదా మూడో వారంలో ప్రారంభిస్తారని తెలిసింది. అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు. చేర్పులు చేయకుండా… దరఖాస్తులను స్వీకరించనుంది. దీనిపై పౌరసరఫరాశాల శాఖ రేపోమాపో క్లారిటీ ఇవ్వనుంది. విధివిధానాలతో పాటు దరఖాస్తుల స్వీకరణ తేదీ, ప్రక్రియపై ప్రకటన చేయనుంది.

(3 / 8)

జనవరి 26వ తేదీ నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించగా… అంతకంటే ముందే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ ఈనెల రెండో వారం లేదా మూడో వారంలో ప్రారంభిస్తారని తెలిసింది. అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు. చేర్పులు చేయకుండా… దరఖాస్తులను స్వీకరించనుంది. దీనిపై పౌరసరఫరాశాల శాఖ రేపోమాపో క్లారిటీ ఇవ్వనుంది. విధివిధానాలతో పాటు దరఖాస్తుల స్వీకరణ తేదీ, ప్రక్రియపై ప్రకటన చేయనుంది.(photo source https://epds.telangana.gov.in)

ఇదిలా ఉంటే ప్రజాపాలన కార్యక్రమంలో చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకొనివాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రేషన్ కార్డుల మంజూరు విషయంలో తెలంగాణ కేబినెట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్జుల జారీగి ప్రత్యేకంగా దరఖాస్తులను స్వీకరించనుంది. అయితే వీటిని ఆన్ లైన్ లో కాకుండా… ఆఫ్ లైన్ లో తీసుకోనుంది. . గ్రామసభలు నిర్వహించి అప్లికేషన్లను స్వీకరించనుంది. ఆ తర్వాత వీటిని ఆన్ లైన్ చేసి… జనవరి 26 నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిసింది.

(4 / 8)

ఇదిలా ఉంటే ప్రజాపాలన కార్యక్రమంలో చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకొనివాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రేషన్ కార్డుల మంజూరు విషయంలో తెలంగాణ కేబినెట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్జుల జారీగి ప్రత్యేకంగా దరఖాస్తులను స్వీకరించనుంది. అయితే వీటిని ఆన్ లైన్ లో కాకుండా… ఆఫ్ లైన్ లో తీసుకోనుంది. . గ్రామసభలు నిర్వహించి అప్లికేషన్లను స్వీకరించనుంది. ఆ తర్వాత వీటిని ఆన్ లైన్ చేసి… జనవరి 26 నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిసింది.(https://epds.telangana.gov.in)

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 90 లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల కోసం అవకాశం ఇస్తే… మరో 10 నుంచి 12 లక్షలు కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

(5 / 8)

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 90 లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల కోసం అవకాశం ఇస్తే… మరో 10 నుంచి 12 లక్షలు కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని వచ్చిన దరఖాస్తులను ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.  ఇలాంటివి 10 నుంచి 12 లక్షలకుపైగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రక్రియను కూడా ప్రభుత్వం క్లియర్ చేయనుంది.

(6 / 8)

రేషన్ కార్డులను రీడిజైన్‌ చేసి ఫిజికల్‌ కార్డులు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే పలు డిజైన్లను పరిశీలించినట్లు తెలిసింది. వీటిలో ఏదో ఒక దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

(7 / 8)

రేషన్ కార్డులను రీడిజైన్‌ చేసి ఫిజికల్‌ కార్డులు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే పలు డిజైన్లను పరిశీలించినట్లు తెలిసింది. వీటిలో ఏదో ఒక దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

రేషన్ కార్డుతో సంక్షేమ పథకాలు ముడిపడి ఉంటాయి. కొత్త రేషన్ కార్డుల మంజూరు చేస్తేనే లబ్దిదారులు ఆహార భద్రత, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుతుంది. ఈ క్రమంలో.. చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా  పెళ్లైన జంటలు.. తమ పేర్ల నమోదు కోసం భారీగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు