(1 / 7)
తిరుపతి రైల్వే స్టేషన్ రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. అధ్మాత్మిక నగరం తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఏకంగా రూ.300కోట్ల రుపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంల పైభాగాన్ని కూడా వినియోగించుకునేలా నిర్మాణాలు చేపట్టారు. అత్యాధునిక హంగులతో రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతోంది.
(2 / 7)
తిరుపతి రైల్వే స్టేషన్‌కు కొత్త టెర్మినల్ భవనంతో పాటు ప్లాట్‌ఫాంలను అనుసంధానించేలా నిర్మాణాలు, ప్లాట్‌ఫామ్ పైభాగంలో కమర్షియల్ స్పేస్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
(3 / 7)
రూ.300కోట్ల రుపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే కొలిక్కి వస్తున్నాయి. రైలు ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా ప్లాట్‌ఫాంలపై సదుపాయాలు, కొత్త హంగుల్ని కల్పిస్తున్నారు.
(4 / 7)
ప్రధాన టెర్మినల్ భవనం నుంచి స్టేషన్లోని అన్ని ప్లాట్ ఫాంలను అనుసంధానించేలా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్యాసింజర్ వెయిటింగ్ లాంజ్‌లు, కమర్షియల్ ఏరియా ఇతర సదుపాయాల నిర్మాణం చేపడుతారు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో తిరుపతి కూడా ఒకటి కావడంతో భారీ ఎత్తున సదుపాయలు కల్పిస్తున్నారు. ఇందుకోసం అమృత్ స్టేషన్ స్కీమ్‌లో రూ.300కోట్లు కేటాయించారు.
(5 / 7)
తిరుపతి రైల్వే స్టేషన్‌లో నూతన టెర్మినల్ భవన నిర్మాణం ఇప్పటికే ఓ రూపుకు వచ్చింది. కొత్త సదుపాయాలను వీలైనంత త్వరగా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
(6 / 7)
దేశంలో ఎక్కడా లేని విధంగా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌ల పైభాగాన్ని కూడా సద్వినియెగం చేసేలా నిర్మాణలు చేపట్టారు. ప్లాట్‌ఫాం దిగువన రైళ్ల రాకపోకలతో సంబంధం లేకుండా అదనపు స్థలం ప్రయాణికులకు అందుబాటులో వచ్చేలా కొత్త డిజైన్లను రూపొందించారు.
(7 / 7)
తిరుపతి అధ్యాత్మిక నగరానికి తగిన విధంగా ప్లాట్‌ఫాం డిజైన్లను రూపొందించారు.
ఇతర గ్యాలరీలు