(1 / 6)
ఉరుకుల పరుగుల జీవనశైలిలో పురుషులు తమ వీర్యకణాల ఆరోగ్యం గురించి పట్టించుకోరు. ఫలితంగా వారు వివాహానంతరం లైంగిక సంబంధంలో, పిండం ఏర్పడటంలో సమస్యలను ఎదుర్కొంటారు. మనం రోజూ తినే కొన్ని ఆహారాలను తినడం ద్వారా వీర్యకణాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా ఆరోగ్యకరమైన వీర్యకణాలను పొందవచ్చు.
(2 / 6)
విటమిన్ ఇ, విటమిన్ సి స్పెర్మ్ కౌంట్‌తోపాటు దాని నాణ్యతను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బ్రోకలీ, బచ్చలికూర, అవోకాడో వంటి ఆహారాలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.
(3 / 6)
నారింజ, టమోటాలు, అలాగే ద్రాక్ష వంటి ఆహారాలలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి సహజంగా స్పెర్మ్ కౌంట్, నాణ్యతను పెంచుకోడానికి ఈ ఆహారాలను ప్రతిరోజూ తినండి.
(4 / 6)
సాల్మన్, సార్డినెస్ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ ఉత్పత్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడతాయి.
(5 / 6)
వాల్ నట్స్, జీడిపప్పులో విటమిన్ బి 6, జింక్‌తోపాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి స్పెర్మ్ ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యమైనవి.
(6 / 6)
వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా వీర్య కణాల ఉత్పత్తితోపాటు నాణ్యతను సమర్ధవంతంగా మెరుగుపరుస్తాయి. ఇలా మీ స్పెర్మ్ కౌంట్ క్వాలిటీగా పెరగడానికి ఈ ఆహారాలను తరచుగా తీసుకునే ఫుడ్‌తోపాటు తీసుకోండి. ఈ ఫుడ్స్ సరిగా తీసుకుంటే మగవారు స్పెర్మ్ విషయంలో చింతిచాల్సిన అవసరం ఉండదు.
ఇతర గ్యాలరీలు