Tollywood: ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే - తండేల్‌కు పోటీ లేనట్లే!
ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో నాలుగు సినిమాలు నిలవబోతున్నాయి. వీటిలో నాగచైతన్య తండేల్‌పైనే ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. తండేల్‌తో పాటు ఈ వారం రిలీజ్ అవుతోన్న మూవీస్ ఇవే...
(1 / 4)
అజిత్ విదాముయార్చి మూవీ పట్టుదల పేరుతో తెలుగులోకి డబ్ అవుతోంది. ఫిబ్రవరి 6నరిలీజ్ అవుతోన్న ఈ మూవీని టాలీవుడ్ ఆడియెన్స్ పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. అందుకు తగ్గట్లే మేకర్స్ తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. పట్టుదల మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.
(2 / 4)
లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తండేల్ ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఓ జాలరి జీవితానికి ప్రేమకథ, దేశభక్తి జోడించి దర్శకుడు చందూ మొండేటి ఈ మూవీని తెరకెక్కిస్తోన్నారు. తండేల్ అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. నాగచైతన్య కెరీర్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ ఓపెనింగ్స్‌ను ఈ మూవీ రాబట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
(3 / 4)
లాంగ్ గ్యాప్ తర్వాత ఒక పథకం ప్రకారం మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హీరో సాయిరాం శంకర్. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇతర గ్యాలరీలు