Ajith Birthday: అజిత్ నటించిన ఒకే ఒక తెలుగు మూవీ ఇదే - హీరోగా అతడి కెరీర్ మొదలైంది ఈ సినిమాతోనే!
Ajith Birthday: కోలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతోన్నాడు అజిత్. రజనీకాంత్, విజయ్ వంటి అగ్ర హీరోలతో సమానంగా తమిళనాట అజిత్‌కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇది. అయితే హీరోగా అజిత్ సినీ జర్నీ మాత్రం తెలుగు మూవీతోనే మొదలైంది. ఆ సినిమా ఏదంటే?
(1 / 5)
ముప్ఫై ఏళ్ల సినీ కెరీర్‌లో అజిత్ ఇప్పటివరకు ఒకే ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశాడు. అదే ప్రేమపుస్తకం మూవీ. 1993లో రిలీజైన ఈ మూవీకి మూడు నంది అవార్డులను దక్కించుకున్నది.
(2 / 5)
హీరోగా అజిత్‌కు ఫస్ట్ అవకాశం తెలుగులోనే వచ్చింది. ప్రేమ పుస్తకం మూవీనే అజిత్ మొదట అంగీకరించాడు. కానీ అజిత్ కెరీర్‌లో సెకండ్ మూవీగా ప్రేమ పుస్తకం రిలీజైంది. ప్రేమ పుస్తకం తర్వాత తెలుగులో మళ్లీ స్ట్రెయిట్ సినిమా ఏది చేయలేదు అజిత్.
(3 / 5)
ప్రేమపుస్తకం సినిమాకు సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. కానీ షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో గొల్లపూడి శ్రీనివాస్ మరణించడంతో మారుతీరావు దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సినిమాను కంప్లీట్ చేశాడు.
(4 / 5)
అజిత్ ప్రస్తుతం తమిళంలో విద్యా ముయార్చి షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మగీజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న ఈ యాక్షన్ మూవీలో త్రిష, రెజీనా హీరోయిన్లుగా నటిస్తోన్నారు.
ఇతర గ్యాలరీలు