(1 / 6)
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ ఆలయాలను సందర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. ఉప్పల్ డిపో నుంచి వీకెండ్స్ లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది.
(2 / 6)
ప్రతి వీకెండ్ లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.ఇందులో భాగంగా స్వర్ణగిరి ఆలయం, వెయ్యిస్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, లక్నవరం, రామప్ప దేవాలయం చూపిస్తారు.
(3 / 6)
మెట్రో డీలక్స్ బస్సుల్లో జర్నీ ఉంటుంది. పెద్దలకు రూ. 830గా టికెట్ ధర ఉంటుంది.ఇక పిల్లలకు రూ. 450గా నిర్ణయించారు.
(4 / 6)
ఈ ప్యాకేజీకి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు 9959226140 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు సూచించారు. అంతేకాకుండా ముందుస్తుగా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.
(5 / 6)
ఆసక్తి గల ప్రయాణికులు https://www.tgsrtc.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లను ముందస్తుగానే బుకింగ్ చేసుకునే వీలు ఉంటుంది.
(TGRTC Twitter)(6 / 6)
ఈ ఒక్క ప్యాకేజీనే కాకుండా అరుణాచలంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రముఖ ఆలయాలకు కూడా తెలంగాణ ఆర్టీసీ పలు ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. వీటి వివరాలను కూడా అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు