Power Outages : బల్లులు, పిల్లులతో 14 శాతం ఫీడర్ ట్రిప్పులు- టీజీఎస్పీడీసీఎల్ నిర్ణయంతో చిన్ని ప్రాణులు సేఫ్
- Power Outages In Telangana : విద్యుత్ అంతరాయాలపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. బల్లులు, పిల్లులు, పావురాలు, ఉడుతలు, చిన్న పక్షుల కారణంగా విద్యుత్ అంతరాయాలు తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్జీ ఫ్యూజ్ సెట్‌లలో సిలికాన్ క్లాంపులు ఉపయోగిస్తుంది.
- Power Outages In Telangana : విద్యుత్ అంతరాయాలపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. బల్లులు, పిల్లులు, పావురాలు, ఉడుతలు, చిన్న పక్షుల కారణంగా విద్యుత్ అంతరాయాలు తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్జీ ఫ్యూజ్ సెట్‌లలో సిలికాన్ క్లాంపులు ఉపయోగిస్తుంది.
(1 / 5)
విద్యుత్ అంతరాయాలపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇటీవల కాలంలో విద్యుత్ తీగలు, పవర్ కండక్టర్లు, హెచ్‌జీ ఫ్యూజ్‌ల వద్ద చిన్న చిన్న పక్షులు, మూగజీవులైన బల్లి, పిల్లి, పావురాలు, ఉడుత, ఉడుము మృత్యువాతపడుతున్నాయి.
(2 / 5)
తెలంగాణలో బల్లులు, పిల్లులు, పావురాలు, ఉడుతలు, కాకులు, చిన్న పక్షుల కారణంగా విద్యుత్ అంతరాయాలు తగ్గించేందుకు టీజీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఎస్పీడీసీఎల్ లో 14% ఫీడర్ ట్రిప్పులు చిన్న చిన్న మూగజీవులు కారణమని విద్యుత్ అధికారులు గుర్తించారు.
(3 / 5)
ఈ సరీసృపాలు హెచ్జీ ఫ్యూజ్ సెట్‌లు, బ్రేకర్లు, ట్రాన్స్‌ఫార్మర్‌ల దగ్గర ఇన్సులేటర్‌లపై లైవ్ పాయింట్లు, ఎర్త్ పాయింట్‌లపై పాకుతున్నప్పు విద్యుదాఘాతానికి గురవుతున్నాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలుగుతున్నాయని అధికారులు తెలిపారు.
(4 / 5)
ఈ సమస్యను అధికమించేందుకు ప్రస్తుతం ఎలక్ట్రికల్ పరికరాలలో హెచ్జీ ఫ్యూజ్ సెట్‌లలో మెటల్ క్లాంప్‌లను ఉపయోగిస్తున్నారు. వీటి స్థానంలో ప్రత్యేకంగా రూపొందించిన ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ పాలిమర్ సిలికాన్ క్లాంప్‌లతో భర్తీ చేయాలని టీజీఎస్పీడీసీఎల్ నిర్ణయించింది.
(5 / 5)
ముందుగా చెట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో బల్లులు, తొండలు, ఇతర సరీసృపాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సుమారు 3,000 FRB సిలికాన్ క్లాంప్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ చిన్న మార్పు చిన్న చిన్న మూగ జీవుల ప్రాణాలను రక్షిస్తాయని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించవచ్చని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.
ఇతర గ్యాలరీలు