తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా, కారణాలివే-tgpsc group 3 certificate verification postponed ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా, కారణాలివే

తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా, కారణాలివే

Published Jun 11, 2025 10:20 AM IST Maheshwaram Mahendra Chary
Published Jun 11, 2025 10:20 AM IST

గ్రూప్ 3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియపై టీజీపీఎస్సీ మరో అప్డేట్ ఇచ్చింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన షెడ్యూలును వాయిదా వేసినట్లు ప్రకటించింది. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ ను ప్రకటిస్తామని తెలిపింది.

తెలంగాణ గ్రూప్ 3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ను టీజీపీఎస్సీ వాయిదా వేసింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదలైంది. ఈనెల 18 నుంచి జులై 6 వరకు వెరిఫికేషన్ ఉంటుందని టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

(1 / 7)

ఇటీవలనే షెడ్యూల్ ప్రకటించిన టీజీపీఎస్సీ… పలు కారణాల రీత్యా గ్రూప్ 3 వెరిఫికేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా గ్రూప్‌-2 పోస్టుల తుది నియామక ప్రక్రియ నేపథ్యంలోనే దీన్ని వాయిదా వేసింది.

(2 / 7)

గ్రూప్ 2 ప్రక్రియంతా పూర్తి అయితే… గ్రూప్ 3 లో ఎలాంటి బ్యాక్ ల్యాగ్స్ ఉండే అవకాశం ఉండదని పలువురు అభ్యర్థులు టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు.  గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో కొందరికి రెండు ఉద్యోగాలు వచ్చే అవకాశాలుంటాయని… ఇలాంటి నేపథ్యంలో… కొన్ని పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు.

(3 / 7)

గ్రూప్‌-2, 3కు ఒకేసారి పరిశీలన చేపట్టి ఫలితాలు ప్రకటిస్తే రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఏదో ఒకటి వదిలిపెట్టాల్సి ఉంటుంది. కమిషన్‌ నిబంధనల ప్రకారం ఫలితాలు వెల్లడించాక భర్తీ కాని, ఉద్యోగాల్లో చేరని పోస్టులన్నీ బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోతాయి. దీంతో చాలా మంది అభ్యర్థులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.

(4 / 7)

పోస్టులు మిగిలిపోకుండా ముందుగా గ్రూప్ 2 ప్రక్రియనే పూర్తి చేయనున్నారు. తద్వారా  గ్రూప్ 3లో ఎలాంటి బ్యాక్ లాగ్స్ ఉండే అవకాశం ఉండదు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు కమిషన్… వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి షెడ్యూల్ ను త్వరలోనే వెల్లడిస్తామని వెల్లడించింది.

(5 / 7)

1,365 గ్రూప్‌-3 సర్వీసు పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఇప్పటికే పరీక్షలను నిర్వహించిన మెరిట్ లిస్ట్ ను కూడా విడుదల చేసింది.

(6 / 7)

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత… ఎంపికైన వారి తుది జాబితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. . https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు  తెలుసుకోవచ్చు.

(7 / 7)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు