
(1 / 8)
హైదరాబాద్ లోని రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన భూవేలంలో ఎకరాకు రికార్డు స్థాయిలో ధర పలికింది. గతంలో ఎప్పడూ లేనివిధంగా ఎకరా రూ.177 కోట్ల ధర పలికింది.

(2 / 8)
TGIIC నిర్వహించిన ఈ వేలంలో 7.67 ఎకరాల ల్యాండ్ పార్సిల్‌ను MSN అనే సంస్థ దక్కించుకుంది. ప్రారంభ ధర ఎకరాకు రూ.101 కోట్లు ఉండగా… సదరు సంస్ఖ ఏకంగా ఎకరా భూమిని రూ.177 కోట్లకు కొనుగోలు చేసింది.
(3 / 8)
రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ప్రభుత్వ భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. ఈ వేలానికి అనూహ్య స్పందన రావటంతో... ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,357 కోట్ల ఆదాయం లభించినట్లు అయింది.

(4 / 8)
ఈ ప్రాంతంలో మొత్తం 18.67 ఎకరాల ప్రభుత్వ భూవేలానికి టీజీఐఐసీ ఏర్పాట్లు చేసింది. ఇందులో సర్వే నంబరు 83/1లో ప్లాట్ నంబరు 19లో 11 ఎకరాలు ఉంది. ఇక ఇదే సర్వే నంబరులో ప్లాట్ నంబరు 15ఎ2లో 7.67 ఎకరాలున్నాయి.

(5 / 8)
ఒక్కో ఎకరానికి ప్రారంభ ధరనే రూ.101 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ఈ-వేలం నిర్వహించగా… 15ఎ2లోని 7.67 ఎకరాల భూమి రికార్డు స్థాయిలో అమ్ముడుపోవటంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో సరికొత్త రికార్డు నెలకొన్నట్లు అయింది.
(ChatGPT)

(6 / 8)
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా జరిగిన భూవేలాల్లోనే అత్యధిక ధర అని టీజీఐఐసీ తెలిపింది.

(7 / 8)
గతంలో కూడా రాయదుర్గం, కోకాపేట నియోపోలీస్ కూడా వేలం నిర్వహించారు.
2022లో కోకాపేట నియోపోలీస్ వేలంలో 3.60 ఎకరాల్లో ఎకరాకు రూ.100.75 కోట్లు గరిష్ఠ ధర పలికి అప్పట్లో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాయదుర్గంలో ఎకరాకు రూ.177 కోట్లు పలకటంతో… పాత రికార్డులు బద్దలైపోయాయి.

(8 / 8)
హైటెక్ సిటీ- గచ్చిబౌలి ప్రాంతాల మధ్య ఈ ప్రాంతం ఉండడంతో ఇక్కడి భూములకు భారీగా డిమాండ్ ఉంది. అంతేకాకుండా విమానాశ్రయానికి కూడా అతి దగ్గరగా ఉండటంతో పలు రియల్ ఎస్టేట్ సంస్థలు ఇక్కడ ఇన్విస్ట్ చేయటానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నాయి.
ఇతర గ్యాలరీలు