తెలంగాణ టెట్ 2025 అప్డేట్స్ - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు...!-tg tet 2025 online application deadline ends today know these key details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  తెలంగాణ టెట్ 2025 అప్డేట్స్ - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు...!

తెలంగాణ టెట్ 2025 అప్డేట్స్ - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు...!

Published Apr 30, 2025 06:57 AM IST Maheshwaram Mahendra Chary
Published Apr 30, 2025 06:57 AM IST

తెలంగాణ టెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇవాళ్టి(ఏప్రిల్ 30)తో ఈ గడువు పూర్తవుతుంది. మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( తెలంగాణ టెట్‌-2025) దరఖాస్తుల గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించటంతో పాటు ప్రాసెస్ పూర్తి చేయాలి.

(1 / 8)

తెలంగాణ టెట్ 2025 (జూన్ సెషన్) షెడ్యూల్ వివరాల ప్రకారం.... ఏప్రిల్ 30వ తేదీతో అప్లికేషన్లు ముగుస్తాయి. అప్లయ్ చేసే అభ్యర్థులు ఒక పేపర్ కు రూ. 750 చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.

(2 / 8)

గతంతో పోల్చితే ఈసారి టెట్ కు పెద్దగా స్పందన కనిపించటం లేదు. ఈసారి 1.50 లక్షలకు మించి దరఖాస్తులు రాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం నాటికి ఒక లక్షా 30 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు.

(3 / 8)

గతేడాది రెండుసార్లు టెట్  పరీక్షలు నిర్వహించారు. చివరిసారిగా  జరిగిన టెట్‌-2024 చివరి విడత పరీక్షకు 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో 2,05,278 మంది పరీక్ష రాశారు. చివరి నోటిఫికేషన్ తో పోల్చితే… ఈసారి అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన లేనట్లు కనిపిస్తోంది.

(4 / 8)

జూన్ 15 నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 30వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుంది. ప్రాథమిక కీలను ప్రకటించిన తర్వాత.... జూలై 22వ తేదీన టెట్‌ ఫలితాలను వెల్లడిస్తారు.

(5 / 8)

తెలంగాణ టెట్ 2025 ఎగ్జామ్ 150 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు ఉంటుంది. అయితే ఇందులో జనరల్‌ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు సాధిస్తే టెట్ అర్హత సాధించినట్లు అవుతుంది. టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ రాసేందుకు అర్హులవుతారు. ఇందులో స్కోర్ ఆధారంగా.... డీఎస్సీలో వెయిటేజీ వస్తుంది.

(6 / 8)

టెట్ అప్లికేషన్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే 7032901383, 9000756178 నెంబర్లను సంప్రదింవచ్చు. అంతేకాకుండా తెలంగాణ టెట్ ఆఫీస్ ను సంప్రదించేందుకు 7093708883 / 7093708884 నెంబర్లకు కాల్ చేయవచ్చు.

(7 / 8)

టెట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫీజు చెల్లించటంతో పాటు దరఖాస్తు ఫామ్ ను పూర్తి చేయవచ్చు.

(8 / 8)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు